Pawan Kalyan - Dil Raju: పవన్ కళ్యాణ్ తో తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ (FDC) దిల్ రాజు సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.
Pawan Kalyan - Dil Raju: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ (FDC) దిల్ రాజు (Dil Raju) సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. 2025 జనవరి 4న రాజమండ్రిలో జరిగే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. సినిమా పరిశ్రమ అభవృద్దిపై కూడా చర్చించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు.
We extend our sincere gratitude to the Honorable Deputy Chief Minister, Shri. @PawanKalyan Garu, for his invaluable time and for agreeing to attend the power packed Pre-Release Event of #GameChanger pic.twitter.com/3FPRyFTDtR
— Sri Venkateswara Creations (@SVC_official) December 30, 2024
సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10న విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. జనవరి 1న ట్రైలర్ విడుదల కానుంది. విజయవాడలో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కటౌట్ డిసెంబర్ 29న ఆవిష్కరించారు.
ఈ కటౌట్ 256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కటౌట్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. గత వారమే అమెరికాలో ఈ సినిమా ఈవెంట్ జరిగింది. ఈవెంట్ లో రామ్ చరణ్ సహా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షో, టికెట్ ధర పెంపులుండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. టాలీవుడ్ ప్రముఖుల భేటీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire