సినిమాని దర్శకుడు చేతుల్లో పెట్టేసిన రాజుగారు

సినిమాని దర్శకుడు చేతుల్లో పెట్టేసిన రాజుగారు
x
Highlights

తమిళం లో '96' సినిమా మా ఒక క్లాసిక్ చిత్రం గా నిలిచి పోయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన ఈ...

తమిళం లో '96' సినిమా మా ఒక క్లాసిక్ చిత్రం గా నిలిచి పోయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ఎమోషనల్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా మారింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో సమంత శర్వానంద్ హీరో హీరోయిన్లు గా కనిపించనున్నారు. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు.

దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా విషయంలో దిల్ రాజు ప్రమేయం ఎక్కువగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారట. నిజానికి ఈ సినిమా కోసం దేవి శ్రీ ని తీసుకోవాలని, అలాగే సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా జోడిస్తే బాగుంటుందని దిల్ రాజు అనుకున్నారట. కానీ అలా చేస్తే సినిమాలో సోల్ దెబ్బతింటుందని ప్రేమ్ కుమార్ ససేమిర ఒప్పుకోలెదు. అందుకే ఈ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చెప్పకూడదని ప్రేమ్ కుమార్ షరతులు పెట్టడంతో దిల్ రాజు కూడా సైలెంట్ అయిపోయారు అని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories