"ఆచార్య" పాన్ ఇండియన్ సినిమా కాదని దిల్ రాజు ఉద్దేశమా?

Did Dil Raju mean that Acharya is not a pan-Indian film
x

"ఆచార్య" పాన్ ఇండియన్ సినిమా కాదని దిల్ రాజు ఉద్దేశమా?

Highlights

Acharya: చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతుండగా, "ఎఫ్ 3" సినిమాని 28 ఏప్రిల్ న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు.

Acharya: కరోనా కారణంగా వాయిదా పడిన ప్యాన్ ఇండియన్ సినిమాలు అన్ని ఒకే రోజున తమ విడుదల తేదీలను వరుసగా ప్రకటించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. "ఆర్ ఆర్ ఆర్", "రాధేశ్యామ్", "భీమ్లా నాయక్", "సర్కారు వారి పాట", "ఎఫ్3", "ఆచార్య" సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించేశాయి. అయితే ఇంతకు ముందు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తన సినిమాని "ఆర్ఆర్ఆర్" కోసం వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నానని, "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఒక ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని అందుకే తమ సినిమాని వాయిదా వేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు "ఎఫ్ 3" సినిమా ని ఆచార్య సినిమా కంటే ఒకరోజు ముందు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు వైఖరిపై అభిమానులు మండిపడుతున్నారు.

చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతుండగా, "ఎఫ్ 3" సినిమాని 28 ఏప్రిల్ న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. మరి "ఆర్ ఆర్ ఆర్" కోసం సినిమా వాయిదా వేస్తామన్న దిల్ రాజు "ఆచార్య" సినిమా నీ ప్యాన్ ఇండియన్ సినిమాగా కానీ భారీ బడ్జెట్ సినిమాగా కానీ చూడడం లేదా అంటూ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. అయితే ఎఫ్ 3 మరియు ఆచార్య సినిమాల క్లాష్ పై వెనుక ఒక స్టోరీ కూడా ఉంది. "భరత్ అనే నేను" సినిమా సమయంలో దిల్రాజుకి మరియు కొరటాల శివ కి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఆచార్య సినిమా రైట్స్ ను కొరటాల శివ అందుకే దిల్ రాజు కి కాకుండా వరంగల్ శ్రీను కి ఇచ్చారు

Show Full Article
Print Article
Next Story
More Stories