Allu Arjun: అల్లు అర్జున్ టెన్షన్ పడుతున్నాడా? అసలు విషయం అదేనా?
Allu Arjun: పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయికి పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Allu Arjun: పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయికి పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం ఈ హీరోకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. తెలుగులోనే కాకుండా దాదాపు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నప్పటికీ.. తన సొంత తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ద్వారా ట్రోల్స్ బారిన పడుతున్నారు.
గత కొంతకాలంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్‌కు కాకుండా వైసీపీకి చెందిన తన స్నేహితుడి కోసం ప్రచారం చేశారు. ఇది మెగా క్యాంపులో అసలు గొడవకు కారణమైంది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. దాంతో పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ వస్తోంది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆ విబేధాలు ఏమైనా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తాయేమోనని అల్లు అర్జున్ భయపడుతున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప2 ది రూల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలను మెగా అభిమానులు తప్పుపడుతూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా చెన్నై వేదికగా పుష్ప2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ పుష్ప2 మేకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా.. వారి కోసం ఎక్కడికైనా, ఎందాకైనా వస్తా, వారి వల్లే నేను స్థాయిలో ఉన్నాను. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని తెలిపారు. అయితే దీన్ని ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే ఈ స్థాయికి వచ్చానని.. చిరంజీవి నా దేవుడు అని, మెగా అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు. ఇప్పుడు తన సొంత టాలెంట్‌తో పైకి వచ్చానని.. తన తండ్రి తనకు సర్వస్వం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు తన అభిమానులను అల్లు ఆర్మీ అని మార్చుకుని.. ఇప్పుడు సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్. అయితే గతంలో ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడడంపై సోషల్ మీడియాలో అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తాను రిలేషన్‌షిప్స్‌కి చాలా వాల్యూ ఇస్తాను అని.. అవతల వాళ్ల నిర్ణయాలను ఎంతగానో గౌరవిస్తానని చెప్పొకొచ్చారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే అది ఆ టాపిక్ వరకే అని.. తన మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌లోకి అవి తీసుకురానని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతూ.. అవి మెగా అభిమానులకు కౌంటర్ అనిపించేలా ఉన్నాయి. దీంతో మెగా అభిమానులు, జనసైనికులు బన్నీని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇవి ఏమైనా పుష్ప2 సినిమాపై ప్రభావం చూపుతాయేమోనని అల్లు అర్జున్ భయపడుతున్నట్టు సమాచారం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire