Dhanush: చంద్రబాబు బయోపిక్‎లో ధనుష్..అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే

Dhanush: చంద్రబాబు బయోపిక్‎లో ధనుష్..అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే
x
Highlights

Dhanush: తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో ధనుష్. ఒక్కప్పుడు ధనుష్ సినిమాలను ఏమాత్రం పట్టించుకోని తెలుగు ఆడియెన్స్..ఇప్పుడు...

Dhanush: తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో ధనుష్. ఒక్కప్పుడు ధనుష్ సినిమాలను ఏమాత్రం పట్టించుకోని తెలుగు ఆడియెన్స్..ఇప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అంతెందుకు నేరుగా తెలుగు దర్శకులే ఆయనతో సినిమాలు చేస్తున్నారంటే తెలుగు ధనుష్ మార్కెట్ ఏ రేంజ్ కు వెళ్లిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు మాత్రమే కోలీవుడ్ హీరో అయినా..టాలీవుడ్ లోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు ధనుష్. ఆయన నటించిన సినిమాలు తెలుగు డబ్బింగ్ లో విడుదలవుతూనే ఉండేవి.

కాగా రఘువరన్ B-Tech సినిమాతో ధనుష్ కు టాలీవుడ్ లో మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా తర్వాత ధనుష్ నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడున్న సౌత్ హీరోల్లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తున్నాడంటే అది ధనుషే. ఏడాదికి రెండు, మూడు విడుదల ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం లైనప్ లో 3, 4 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. అది కూడా బయెపిక్ మూవీ. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా పేరొందిన చంద్రబాబు బయోపిక్ లో ధనుష్ నటించనున్నడాని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గోపాల్ వన్ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇక ఈ మూవీ..ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవల ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. చంద్రబాబు అప్పట్లో కమెడియన్ గా ఓ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తన సినిమాల్లో నటించిన హీరోయిన్ ల కంటే కమెడియన్ గా నటించిన చంద్రబాబునే ఎక్కువ పారితోషికం తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ధనుష్..ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories