Deepika: కూతురుకు నామకరణం చేసిన స్టార్ కపుల్.. ఇంతకీ పేరు ఏంటో తెలుసా.?
Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఒకరు. ‘రామ్ లీలా’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు.
Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఒకరు. ‘రామ్ లీలా’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఆ తర్వాత 2018లో పెద్దల సమక్షంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.
ఇదలా ఉంటే ఇటీవల ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8వ తేదీన ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దీపిక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ ముందు వరకు దీపికా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీపికా నటించిన చివరి చిత్రం 'కల్కి' ప్రమోషన్స్‌లో కూడా దీపికా పాల్గొంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ క్యూట్ కపుల్స్ తమ చిన్నారికి నామకరణం చేశారు. పాపకు ఈ జంట దువా పుదుకొణె సింగ్ అనే పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రేయర్స్కి సమాధానమే మా గారాల పట్టి. ఇప్పుడు మా హృదయాలు ప్రేమతో నిండిపోయని అనే అర్థం వచ్చేలా దీపికా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిన్నారి కాళ్లను ఫొటో తీసి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దువాకు విషెస్ చెబుతూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire