Daggubati: దగ్గుబాటి కుటుంబంలో విషాదం

Daggubati Ramanaidu Brother Mohan Babu Passed Away
x

Daggubati: దగ్గుబాటి కుటుంబంలో విషాదం

Highlights

Daggubati: దగ్గుపాటి రామానాయుడు తమ్ముడు దగ్గుపాటి మోహన్ మృతి

Daggubati: దగ్గుపాటి కుటుంబంలో విషాదం నెలకొంది. సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తమ్ముడు దగ్గుబాటి మోహన్ బాబు గుండెపోటుతో మృతి చెందారు. మోహన్‌ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మోహన్‌ బాపట్ల జిల్లా, కారంచేడులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చీరాలలోని గోరంట్ల ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. మోహన్ బాబును పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మోహన్ బాబు "ఒక చల్లని రాత్రి" సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. మోహన్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories