Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. సంక్రాంతి పండక్కి పైసా వసూల్

Daaku Maharaaj Twitter Review: డాకు  మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. సంక్రాంతి పండక్కి పైసా వసూల్
x
Highlights

Daaku Maharaaj Twitter Review: నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబీనేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ. శ్రీకర స్టూడియోస్ సమర్ఫణలో సితార ఎంటర్...

Daaku Maharaaj Twitter Review: నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబీనేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ. శ్రీకర స్టూడియోస్ సమర్ఫణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ , చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీస్థాయిలో విడుదలైంది. ఈ మూవీ గురించి నెటిజన్లు, విమర్శకులు సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ చూద్దాం.

డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్ టైనర్. ఈ మూవీలో బాలయ్య,బాబీ డియోల్ పవర్ ఫ్యాక్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఊర్వశీ రౌటేలా ఐటెం సాంగ్ దుమ్మురేపుతోంది. డైలాగ్స్ కు విజిల్స్ వేయాల్సిందే. సీటీమార్ లెవెల్ యాక్షన్స్ సీక్వెన్స్ ఉన్నాయి. ఈ మూవీ రొటీన్ స్టోరీ లైన్ స్క్రీన్ ప్లే అయినప్పటికీ..సంక్రాంతి పండగకు పక్కాగా సరిపోయే మూవీ అంటు ఉమేర్ సంధూ తన రివ్యూ చెప్పారు.


డాకు మహారాజ్ గురించి ఓ నెటిజన్ ఇలా చెబుతూ..ఏయ్ దీనమ్మ ఇది కదా మాకు కావాల్సిన ఎమోషన్ నాగవంశీ డైరెక్టర్ బాబీ. డాకు ఎమోషన్ మూమెంట్స్ విత్ డాకూ హార్స్ అంటూ ట్వీట్ చేశారు.


డాకు మహారాజ్ గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ మూవీకి రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కూడా నమోదు అవుతున్నాయి. బాలయ్య కెరీర్ లో తొలి 100కోట్ల షేర్ 200కోట్ల గ్రాస్ వసూలు చేయడం పక్కా అనిపిస్తోంది. నందమూరి ఫ్యాన్స్ కు, మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి పండగ మరిచిపోలేనిది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


బాలయ్య అంటేనే సినిమా రంగంలో కింగ్, గాడ్ ఆఫ్ మాసెస్, మాస్ అంశాల కాంబినేషన్. ఆయనే ఓ పండగ. ఆయన సినిమా అంటే ఓ సెలబ్రేషన్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.


డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్..బాక్సాఫీస్ ఊచకోత షురూ అయ్యింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories