Corona Crisis: మా గోడు వినండి సారూ.. సినీ కార్మికుల ఆందోళన

Tollywood movie Workers Request To Help
x

సినీ కార్మికుల ఆందోళన

Highlights

Corona Crisis: ఫస్ట్‌వేవ్‌ లాక్‌డౌన్‌లో నష్టపోయిన నిర్మాతలు..మ‌రోసారి లాక్ డౌన్ ప‌డ‌డంతో తినడానికి తిండిలేక సినీ కార్మికుల అవస్థలు ప‌డుతున్నారు.

Corona Crisis: కరోనా నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అయితే.. కరోనా ఫస్ట్‌ వేవ్‌లో విధించిన లాక్‌డౌన్‌తో ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కార్మికులు కోలుకోలేదు. అంతేకాదు సినీ పెద్దలు సైతం భారీగా నష్టపోయారు. ఇక ఇప్పుడు కోవిడ్ సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌తో. తాము ఎలాంటి పరిస్థితులు ఎదురుక్కోవాల్సి వస్తుందోనని సినీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. వేలల్లో కేసులు, వందల్లో మరణాలు. ప్రభుత్వాలు, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజులు గడుస్తోన్న కొద్దీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర సర్కార్‌ లాక్‌డౌన్‌ పదిరోజుల పాటు విధించింది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్నీవర్గాలవారికి అనుమతి ఇస్తూ పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.

ఇదిలా ఉండగా.. కరోనా సెకండ్‌ వేవ్‌లో విధించిన లాక్‌డౌన్‌ సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఇండస్ట్రీపై ఆధారపడే సినీ కార్మికులకు గడ్డు పరిస్థితులే ఎదురువుతాయి. షూటింగ్స్‌ జరిగితే తప్పా.. రోజు గడవని కుటుంబాలు వేలల్లోనే ఉంటాయి. కాగా.. కొన్నిరోజుల ముందు కోవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా సినీ పెద్దలు ఓ నిర్ణయంతో స్వచ్చందంగా సినిమాలు వాయిదా వేసుకున్నారు. అయినప్పటికీ షూటింగ్స్‌ జరిగేవి. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో షూటింగ్స్‌ ఆగిపోయాయి.

మరోవైపు సినీ కార్మికుల బాధ్యత సినీ ఇండస్ట్రీ పెద్దల పైనే ఉందనాలి. గతంలో చిరంజీవి, నాగార్జున ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ చారిటి ద్వారా కార్మికులకు రెండు దఫాలు నిత్యావసర వస్తువులు పంపిణీ అయ్యాయి. దీంతో వారికి కొంతమేర ఆకలి తీరింది. అయితే.. ఈసారి కూడా కరోనా క్రైసిస్‌ చారిటీ ద్వారా పలువురు సినీ ప్రముఖులు కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పకతప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories