శోభిత ధూళిపాళ్ళ 'హాట్'గా ఉందని నాగార్జున చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చ…

శోభిత ధూళిపాళ్ళ హాట్గా ఉందని నాగార్జున చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియోలో చర్చ…
x

శోభిత ధూళిపాళ్ళ 'హాట్'గా ఉందని నాగార్జున చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చ…

Highlights

నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ గురించి నాగార్జున గురువారం వెల్లడించినప్పుడు గతంలో ఆయన చేసిన ప్రకటనను నెటిజన్లు గుర్తు చేశారు.

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల ‘హాట్’ ఉందని నాగార్జున కామెంట్ చేశారు. గూఢచారి సినిమాలో ఆమె నటనను మెచ్చుకుంటూ నాగార్జున 2018లో అలా కామెంట్ చేశారు. కానీ, ఆరేళ్ళ తరువాత ఆ అమ్మాయే తన కోడలు అవుతుందని నాగార్జున ఊహించి ఉండరు.

నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ గురించి నాగార్జున గురువారం వెల్లడించినప్పుడు గతంలో ఆయన చేసిన ప్రకటనను నెటిజన్లు గుర్తు చేశారు.

గూఢచారి చిత్రం సక్సెస్ మీట్ 2018 ఆగస్ట్ 8న జరిగింది. ఆ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ శోభిత ఈ సినిమాలో ‘హాట్’గా ఉందని అన్నారు. సరిగ్గా ఆరేళ్ళ తరువాత అదే ఆగస్ట్ 8న నాగార్జున శోభితతో తన కుమారుడు నాగార్జునకు నిశ్చితార్థం జరిగిందని ప్రకటించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తవ్వకాలు జరిపే వారు ఆ వీడియోను తీసి కట్ చేసి షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని నాగార్జున బహుశా ఆనాడు ఊహించి ఉండరు.

ఆ సక్సెస్ మీట్ లో దాదాపు పది నిమిషాలు మాట్లాడిన నాగార్జున చిత్ర దర్శకుడు శశి కిరణ్ తిక్కాను ఘనంగా పొగిడారు. హీరోయిన్ పాత్రను అద్భుతంగా చూపించారని మెచ్చుకున్నారు. “శోభిత ధూళిపాళ్ళ ఈ చిత్రంలో బాగుంది అని చెబితే సరిపోదు. షీ వజ్ హాట్ ఇన్ ది ఫిల్మ్. ఈ చిత్రంలో ఆమెకొక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది” అని నాగార్జున అన్నారు.

ఆరేళ్ళ తరువాత ఆగస్ట్ 8న నాగార్జున, “మా కుమారుడు నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ ఈ ఉదయం 9.42 గంటలకు జరిగిందని తెలపడానికి సంతోషిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తరువాత కాసేపటికే, నాగార్జున ‘హాట్’ కామెంట్స్ వీడియో సోషల్ వేదికల మీద బయటకు వచ్చింది. కొంతమంది ఇది ఫన్నీ విషయమే అంటే, మరి కొందరు మాత్రం నాగార్జున అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అంటున్నారు.

“అప్పటికి నాగ చైతన్య, సమంత కలిసే ఉంటున్నప్పటికీ, ఒక యువ నటి గురించి నాగార్జున అలా మాట్లాడడం విపరీత ధోరణే” అని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.

మరొక యూజర్, “నాగార్జున ఒక కొత్త నటికి ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ గానే ఆ వ్యాఖ్యల్ని చూడాలి. అందులో తప్పు వెతకడం కరెక్ట్ కాదు” అని అభిప్రాయపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories