OTT: ఓటీటీలోకి 'కుర్రాళ్లు' వచ్చేస్తున్నారు.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

Committee Kurrollu movie OTT streaming in ETV win app
x

OTT: ఓటీటీలోకి 'కుర్రాళ్లు' వచ్చేస్తున్నారు.. స్ట్రీమింగ్ ఎందులో అంటే.. 

Highlights

ఆగస్టు 9వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది 'కమిటీ కుర్రోళ్లు'. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నిర్మాతగా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది నిహారిక. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

ఆగస్టు 9వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈటీవీ విన్‌ ఓటీటీలో వేదికగా కమిటీ కుర్రాళ్లు సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తేదీ ఎప్పుడన్న విషయాన్ని ప్రకటించలేదు కానీ.. కమింగ్ సూన్ అంటూ ఎక్స్‌ వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వినాయకచవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

కథ విషయానికొస్తే.. గోదావ‌రి జిల్లాల్లో పురుషోత్తంప‌ల్లి అనే గ్రామంలో జ‌రిగే భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌ర‌కు దానిలో భాగంగా చేసే బ‌లి చేటకు ఎంతో ప్రాశ‌స్త్యం ఉంది. ఈ జాతర జరుగుతోన్న సమయంలోనే ఆ ఊరిలో స‌ర్పంచ్ ఎన్నిక‌లు వ‌స్తాయి. దీంతో ఈ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్‌గా పోటి చేసేందుకు ఊరి కుర్రాళ్ల‌లో ఒక‌డైన శివ (సందీప్ స‌రోజ్) ముందుకొస్తాడు. అయితే శివ ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డిన అనంత‌రం ఏం జ‌రిగింది.? స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచారు? భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌రకు శివ‌కు సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories