విలన్ గా సునీల్.. హీరోగా కమెడియన్‌

విలన్ గా సునీల్.. హీరోగా కమెడియన్‌
x
Sunil( File photo)
Highlights

కమెడియన్స్ హీరోలుగా మారడం కొత్తేమి కాదు. అలా అని వింతేమి కాదు. రాజబాబు నుంచి నిన్న వచ్చిన సుడిగాలి సుధీర్ వరకు అందరు కమెడియన్స్ హీరోగా చేసినవారే.....

కమెడియన్స్ హీరోలుగా మారడం కొత్తేమి కాదు. అలా అని వింతేమి కాదు. రాజబాబు నుంచి నిన్న వచ్చిన సుడిగాలి సుధీర్ వరకు అందరు కమెడియన్స్ హీరోగా చేసినవారే.. ఇప్పుడు ఈ లిస్టు లోకి మరో కమెడియన్‌ చేరిపోయాడు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో నటించి మంచి కమెడియన్‌ గా పేరు తెచ్చుకున్న సుహాస్‌ ఇప్పుడు హీరోగా ఓ సినిమాని చేయబోతున్నాడు.

తాజాగా సినిమా కూడా ప్రారంభమైంది. కలర్‌ ఫోటో అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటుడు సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను హృదయ కాలేయం ఫేం స్టీవెన్‌ శంకర్‌, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. దీనితో ఈ సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు షూటింగ్ ప్రారంభమవుతున్న సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు.

ఇందులో హీరోయిన్ గా షార్ట్ ఫిలిం ఫేం ఛాందిని చౌదరి నటిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సీనియర్‌ కమెడియన్‌ సునీల్‌ విలన్‌గా నటిస్తుండటం విశేషం. దర్శకుడు సందీప్‌ రాజ్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories