సినిమా షూటింగ్ ల వివాదం.. త్వరలో కేసీఆర్, బాలయ్య బాబుల భేటీ?

సినిమా షూటింగ్ ల వివాదం.. త్వరలో కేసీఆర్, బాలయ్య బాబుల భేటీ?
x
Highlights

సిని షుటింగులు తిరిగి త్వరలో ప్రారంభం కానున్నాయా? దీనికి సంబంధించి ముహుర్తం ఖరారైందా?మరి సినీ పెద్దల మధ్య రేగిన విభేదాల సంగతేంటి? తెలంగాణ సర్కార్ తో...

సిని షుటింగులు తిరిగి త్వరలో ప్రారంభం కానున్నాయా? దీనికి సంబంధించి ముహుర్తం ఖరారైందా?మరి సినీ పెద్దల మధ్య రేగిన విభేదాల సంగతేంటి? తెలంగాణ సర్కార్ తో చిరంజీవి టీమ్ జరిపిన చర్చల పట్ల గుర్రుగా ఉన్న బాలయ్య త్వరలో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతున్నారా?

లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచి పోయిన సినిమా షుటింగ్ లు త్వరలో ప్రారంభం కానున్నాయి. మొదట సీరియల్స్ ఆ తర్వాత సినిమా అవుడోర్ షుటింగ్ లకు అనుమతులివ్వాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తోంది. ఏలాంటి జాగ్రత్తలు పాటిస్తూ షుటింగ్ లు చేసుకోవాలన్న అంశంపై విధి విధానాలను ఖరారు చేస్తోంది. దీంతో సిని పెద్దల మధ్య పొడసూపిన విభేదాలను పరిష్కరించేలా సిని ఇండ్రస్టీ ప్రయత్నాలు చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా అదే ఆశిస్తోంది.

షుటింగ్ లకు అనుమతులిచ్చే అంశంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరంజీవి, నాగర్జున లతో పాటు పలువురు సిని ప్రముఖులతో చిరంజీవి ఇంట భేటీ అయ్యారు. ఆ తర్వాత వారందిరిని తీసుకుని సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సినిమా షుటింగ్ లకు రాష్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇద్దామనుకుంటున్న తరుణంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సిని ఇండస్ట్రీని ఓ కుదపు కుదిపాయి. తెలంగాణ ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలకు తనను ఆహ్వనించకపోవడాన్ని బాలయ్య బాబు తప్పు బట్టారు. వ్యక్తిగత అవసరాలు, లావా దేవీల కోసమే ఇండస్ట్రీలో కొందరు హీరోలు భేటీ అయ్యారని కామెంట్ చేసి వివాదాల తేనెతుట్టను కదిపారు. దీంతో ఇండస్ట్రీ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. అగ్ర హిరోల మద్య సఖ్యత లేదన్న విషయం బాలయ్య కామెంట్లతో బయట పడింది.

ఇదే అంశం సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వచ్చింది. ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద ఉందన్న ఉద్దేశంతోనే కేసీఆర్..వారికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. కానీ బాలయ్య వ్యాఖ్యలతో ఇది పెద్ద వివాదంగా మారడంతో కేసీఆర్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకిలా జరిగిందని తలసాని దగ్గర తన అసంతృప్తిని బయటపెట్టినట్లు సన్నిహిత వర్గాల కథనం. ఇండస్ట్రీలో కింగ్ గా పేరు పడిన బాలయ్య బాబు అంటే కేసీఆర్ కు అభిమానం ఎక్కువ. బాలకృష్ణ ఎన్నో పౌరాణిక, జానపద సినిమాల్లో నటించారు. తన రాజకీయ గురువు ఎన్టీఆర్ కుమారుడు కావడంతో బాలకృష్ణను కేసీఆర్ ఇష్టపడతారు. అందుకే గతంలో కూడా ఆయన అడిగింది ఏదీ కాదనలేదు. బాలకృష్ణ ట్రస్టీగా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఆస్తి పన్ను మినహాయింపులైనా, ఎన్టీఆర్ ఇతివృత్తంగా బాలకృష్ణ నటించి నిర్మించిన మహానాయకుడు సినిమా షుటింగ్ కోసం అసెంబ్లీని వినియోగించుకునే అంశమైనా ప్రతీ విషయంలోనూ కేసీఆర్ సహకరించారు. బాలకృష్ణ అంటే కేసీఆర్ కు అంత అభిమానం. అందుకే బాలకృష్ణతో త్వరలో సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే కలిసేందుకు బాలయ్య బాబు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఇరువురు త్వరలో భేటీ కావడం ఖాయమని అటు సిని ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ భేటీ తర్వాత.. బాలయ్య బాబు చల్లబడతారని, షుటింగ్ ల పున : ప్రారంభంపై సినీ పెద్దల మధ్య అభిప్రాయ భేదాలు దూది పింజాల్లా తేలిపోతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భేటీ తర్వాత సినిమా షుటింగ్ లపై మరింత క్లారిటి రావడం ఖాయమంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories