HIT 3: నాని సినిమా షూటింగ్‌లో విషాదం.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మృతి

Cinematographer Krishna KR Passes Away While Shooting in Kashmir
x

HIT 3: నాని సినిమా షూటింగ్‌లో విషాదం.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మృతి

Highlights

Cinematographer Krishna KR: హీరో నాని సినిమా షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది.

Cinematographer Krishna KR: హీరో నాని సినిమా షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. హిట్ 3 మూవీ షూటింగ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేఆర్ కృష్ణ మృతిచెందారు. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో షూటింగ్ జరుగుతుండగా కృష్ణకు గుండెపోటు రావడంతో మరణించారు. నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ 3 సినిమా షూటింగ్ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కేఆర్ కృష్ణ పని చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో చిత్ర యూనిట్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

కేరళలోని ఎర్నాకులంకు చెందిన కేఆర్ కృష్ణ సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆమె వయసు 30 ఏళ్లు ఆమె మృతిపట్ల సినిమా యూనిట్ సంతాపం తెలిపింది. కృష్ణ అంత్యక్రియలు ఆమె స్వస్థలంలో నిర్వహించునున్నారు. మరోవైపు కృష్ణ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనగర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడంతోనే ఇలా జరిగి ఉండవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాకు ముందు ఇప్పటికే రెండు పార్టులు రాగా అవి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ హిట్-3 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా 2025 మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories