Siva Sankar Master: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

800 చిత్రాలకు పైగా వర్క్ చేసిన శివశంకర్ మాస్టర్
x
శివ శంకర్ మాస్టర్ మృతి (ఫైల్ ఇమేజ్)
Highlights

Siva Sankar Master: 800 చిత్రాలకు పైగా వర్క్ చేసిన శివశంకర్ మాస్టర్

Siva Sankar: మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన శివ శంకర్‌ మాస్టర్‌ హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళ, తెలుగు సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు శివ శంకర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. 1975లో 'పాట్టు భరతమమ్‌' చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన శివ శంకర్‌ మాస్టర్‌ కురువికూడు చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా మారారు. మరోవైపు నటుడిగానూ తనదైన శైలిలో మెప్పించారు. 2003లో వచ్చి 'ఆలయ్‌'చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్‌ మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. బుల్లితెర పైనా పలు షోలకు జడ్జిగా వ్యవహించారు. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు.

మరోవైపు రాజమౌళి, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీరలో ధీర పాటకు ఉత్తమ జాతీయ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్నారు. దీంతో పాటు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు. 'నేనే రాజు నేనే మంత్రి', 'అక్షర', 'సర్కార్', 'ఎన్టీఆర్‌ కథానాయకుడు', 'రాజుగారి గది3' తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. శివశంకర్ మాస్టర్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories