మెగాస్టార్ కొత్త రెమ్యునిరేషన్ ఫార్ముల

Chiranjeevi not taking remuneration for his films?
x

చిరంజీవి తన సినిమాలకు రెమ్యునరేషన్ ను తీసుకోవటం లేదా?

Highlights

Chiranjeevi: *రెమ్యునరేషన్ విషయంలో సైలెంట్గా ఉన్న మెగా స్టార్

Chiranjeevi: భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 న థియేటర్ లలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా మెగా అభిమానులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయారు. చిరంజీవి మార్కెట్ కూడా ఈ సినిమాతో బాగానే దెబ్బతింది. అయితే చిరంజీవి చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మూడు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. అవే గాడ్ఫాదర్, వాల్తేర్ వీరయ్య, మరియు భోళా శంకర్.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలకు గాను మెగాస్టార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయం మాత్రం ఎవరికీ చెప్పడం లేదట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సినిమా కోసం రెమ్యూనరేషన్ ఎంత కావాలి అని మెగాస్టార్ ని ఇప్పటికి మూడు సార్లు అడిగారు కానీ "ముందు చేద్దాం.. తర్వాత చూద్దాం" అని చిరంజీవి సమాధానం ఇచ్చి ఆ ప్రశ్నను దాటేస్తున్నారట సినిమా మొత్తం పూర్తయిన తర్వాత దాని స్థాయి, వచ్చిన లాభాలను బట్టి అందులో చిరు కొంత వాటా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలకి కూడా ఇదే దారిలో వెళ్ళనున్నారు మెగాస్టార్. ఈ రకంగా సినిమాలకి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదు. ఈ విధంగా నిజానికి చిరంజీవి అనుకరిస్తున్న ఈ ఫార్ములా నిర్మాతలకు బాగా మేలు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories