Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే.. రీరిలీజ్‌కు సిద్ధమైన ఆ మూవీ..!

Chiranjeevi All Time Hit Movie Shankar Dada MBBS Re release in Theaters on August 22nd
x

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే.. రీరిలీజ్‌కు సిద్ధమైన ఆ మూవీ..!

Highlights

Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లలో సందడి చేసిన సినిమాలను మళ్లీ విడుదల చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్.

Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లలో సందడి చేసిన సినిమాలను మళ్లీ విడుదల చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్. అలనాటి హిట్‌ చిత్రాలను ప్రేక్షకులు నేటి తరం టెక్నాలజీకి అనుగుణంగా 4కే రిజల్యూషన్‌తో ఆస్వాదిస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఇలా చాలా మూవీస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మెగా ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

ఆ మూవీ మరేదో కాదు 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌'. 2004లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 22వ తేదీన థియేటర్స్‌లో సందడి చేయనుంది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయ్ ఎంబిబిఎస్’కి ఇది రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని జయంత్ పరాంజీ డైరెక్ట్ చేశాడు. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. శంకర్ దాదాగా చిరంజీవి, ఏటీఎంగా శ్రీకాంత్ చేసిన సందడి అంతాఇంతా కాదు.

ఈ సినిమాలో చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సమేతలు చెబుతుంటే థియేటర్స్ లో ఆడియన్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే లైఫ్ జర్నీలో మనిషి ఎదుర్కొనే అనేక ఎమోషన్స్ ని అందరి మనసుని హత్తుకునేలా చూపించారు. ఇక ఈ సినిమాకి మరో హైలైట్ అంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్. ఈ రీ రిలీజ్ తో థియేటర్స్ అన్ని మ్యూజికల్ కాన్సర్ట్ గా, కామెడీ కార్నివాల్‌ గా మారిపోనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న శంకర్ దాదా ఎంబీబీఎస్ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. భారీగా అత్యంత ఎక్కువ థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నారు. జె.ఆర్.కె పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories