ఆచార్య అప్డేట్ : 16 ఎకరాలలో భారీ సెట్ !

ఆచార్య అప్డేట్ :  16 ఎకరాలలో భారీ సెట్ !
x
Highlights

కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మళ్ళీ మొదలైంది. తాజాగా ఆచార్య షూటింగ్‌లో భాగంగా 16 ఎకరాలలో ఓ భారీ సెట్‌ వేయనున్నారు. ఈ భారీ సెట్ కోసం ఏకంగా రూ. 20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రాన్ని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. మెగస్టార్ పుట్టినరోజున రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మళ్ళీ మొదలైంది. తాజాగా ఆచార్య షూటింగ్‌లో భాగంగా 16 ఎకరాలలో ఓ భారీ సెట్‌ వేయనున్నారు. ఈ భారీ సెట్ కోసం ఏకంగా రూ. 20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడే సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారట దర్శకుడు కొరటాల . అటు ఇంతకుముందే చిత్ర నిర్మాతలు 4 కోట్లతో ఒక ఆలయ సెట్‌ను నిర్మించారు. దీని పర్యవేక్షణ బాధ్యతలన్ని దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి చూసుకుంటున్నారట.

ఆచార్య చిత్రం తరవాత చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. తమిళంలో అజీత్ హీరోగా వచ్చిన 'వేదాళం' చిరు చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ముందుగా వేదాళం చిత్రాన్ని పవన్ కల్యాణ్ రీమేక్ చేయాలనుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories