Chiranjeevi Acharya Movie Updates : రిపీట్ అవుతున్న స్టాలిన్ మూవీ కాంబినేషన్?

Chiranjeevi Acharya Movie Updates : రిపీట్ అవుతున్న స్టాలిన్ మూవీ కాంబినేషన్?
x
Highlights

Chiranjeevi Acharya Movie Updates: గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi Acharya Movie Updates: గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది..అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టి సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీనితో ఆచార్య షూటింగ్ మొదలయింది.

ఇక ఈ సినిమా తరవాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. మలయాళంలో మంచి హిట్ అయిన 'లూసిఫర్' సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తునట్లు చిరంజీవి ఇప్పటికే వెల్లడించాడు. త్వర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి సంబంధించిన వ‌ర్క్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు సుజిత్ ..అంతేకాకుండా నటీనటుల ఎంపిక పైన కసరత్తు జరుగుతుంది. అయితే ఒరిజినల్ సినిమాలో మంజు వారియర్ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారు. విజయశాంతి, సుహాసిని పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఖుష్బూ కూడా చేరిపోయింది..

ఇప్పటికే ఆ పాత్ర కోసం మేకర్స్ ఖుష్భూ ని సంప్రదించారని ఆమె కూడా ఆ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం.. కానీ దీనివల్ల ఎలాంటి అధికార ప్రకటన లేదు.. ఇక చిరంజీవి కుష్బూ కలిసి నటించడం ఇదేమి కొత్తేమీ కాదు.. గతంలో 'స్టాలిన్' సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. మళ్లీ ఇన్నిరోజుల తర్వాత మళ్లీ వీరి కలిసి నటించేందుకు ఛాన్స్ దొరికింది. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories