సోనూసూద్ సేవలకి అమెరికా షెఫ్ ఫిదా!.. ఏం చేశాడంటే?

సోనూసూద్ సేవలకి అమెరికా షెఫ్ ఫిదా!.. ఏం చేశాడంటే?
x
Highlights

కరోనా లాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

కరోనా లాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.. అందులో భాగంగా టాలీవుడ్ విలన్ సోనూసూద్ లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చి సహాయం అందించారు. ప్రజారవాణా లేకా కాలినడకన తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా వలస కూలీలను చూసి చలించిపోయి వారికి బస్సు సౌకర్యాలు కలిపించి వారిని వారి గ్రామాలకు పంపించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అంతేకాకుండా కరోనాతో యద్ధం చేస్తన్న పంజాబ్‌లోని డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ కిట్లు అందించాడు. ముంబైలో తనకున్న హోటల్‌లో వైద్య సిబ్బందికి ఎకామిడేషన్ ఏర్పాటు చేశాడు..దీంతో నెటిజన్లు సోనూసూద్ సేవలను కొనియాడుతూ రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఇక సోనుసూద్ ఈ సేవలకు అమెరికాలోని ప్రఖ్యాత షెఫ్ వికాస్‌ ఖన్నా ఫిదా అయిపోయారు. సోనూసూద్ కి కృతజ్ఞతలు తెలుపుతూ తన కొత్త వంటకానికి సోనూ సూద్‌ సొంత ఊరి పేరు 'మోగా' అని పేరు పెట్టినట్టు తెలిపాడు.. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. "డియర్ సోనూసూద్ బాయ్‌. మీరు ప్రతిరోజు మాలో స్ఫూర్తిని నింపుతున్నారు. కానీ కరోనా కల్లోలంలో ఇప్పట్లో మీకు వండి పెట్టలేను.. కొత్త డిష్ తయారు చేసి దానికి మీరు పుట్టిన ఊరు మోగాగా పేరు పెడుతున్నాను " అని చెబుతూ ఆ కొత్త వంటకానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. దీనిపైన సోనూసూద్ హ్యాపీగా స్పందిస్తూ.. మాకు ఇచ్చిన గౌరవానికి తన సొంత ఊరు గర్వపడుతుందని రీట్వీట్ చేశాడు.

ఇక సోనూసూద్ సినిమాల విషయానికి వచ్చేసరికి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనూసూద్ స్టైలిష్ విలన్ గా టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రంలో పసుపతిగా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత జులాయి, దూకుడు, ఆగడు,కందిరీగ మొదలైన సినిమాల్లో నటించి మంచి విలన్ గా స్థిరపడిపోయారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories