Chaavu Kaburu Challaga Review | చావు కబురు చల్లగా కాన్పెప్ట్ ఓకే...

Chaavu Kaburu Challaga Movie Review
x

Chaavu Kaburu Challaga:( ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

Chaavu Kaburu Challaga Review: సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ కథనం మాత్రం చాలా రొటీన్‌ కు భిన్నంగా లేదు.

Chaavu Kaburu Challaga Movie Review: హీరో కార్తికేయ, హీరోగా లావణ్యా త్రిపాఠి హీరోయిన్ జంటగా కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "చావు కబురు చల్లగా". గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మించబడ్డ ఈ చిత్రం ఈ రోజే విడుదల అయ్యింది. బస్తీ బాలరాజు(కార్తికేయ) వైజాగ్ లోని శవాలను తీసుకెళ్లే ఓ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తూ తన తల్లి ఆమనితో జీవనం గడిపే సామాన్య యువకుడు. మరి అక్కడే ఉండే ఓ వితంతు(లావణ్యా త్రిపాఠి) అనే అమ్మాయిని చూసి తాను ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి ఆమె వెంటే పడుతూ ఎలా అయినా ఇంప్రెస్ చెయ్యాలని చూస్తాడు..కానీ ఊహించని విధంగా మరో పక్క అతని తల్లి మరెవరినో ఇష్టపడుతుంది అని తెలుసుకుంటాడు. మరి ఇక్కడ నుంచి బాలరాజు ఈ క్లిష్ట పరిస్థితులను ఎలా డీల్ చేయగలిగాడు? తన లవ్ ఏమయ్యింది? తన తల్లి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే..

ఈ చిత్రంలో మొట్ట మొదటిగా చెప్పుకోవాలి అంటే కార్తికేయ రోల్ కోసమే చెప్పాలి. ఓ బస్తీ యువకుడిలా సూపర్బ్ పెర్ఫామెన్స్ ను కనబరిచాడు. పూర్తిగా అలాంటి రోల్ కు ఏం కావాలో అందులో లీనమయ్యి సాలిడ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. మరి లావణ్య రోల్ కు వస్తే కార్తికేయ లానే తనకి కూడా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని లాంటి డీ గ్లామ్ రోల్ అటెంప్ట్ చెయ్యడం మంచి విషయం అయితే దానిని అంతే అందంగా చెయ్యడం మరో హర్షణీయ అంశం. చాలా సింపుల్ లుక్స్ తో కనిపించడం వలన ఆమె నటనలో కూడా మరింత సహజత్వం కనిపిస్తుంది. ఎమోషన్స్, తన బాడీ లాంగ్వేజ్ మరియు కొన్ని కీలక సన్నివేశాల్లో తన పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంది.

కార్తికేయ తల్లిగా తనకు తగ్గ పాత్రను ఎంచుకొని నీట్ అండ్ క్లీన్ పెర్ఫామెన్స్ ను చూపించారు ఆమని. అలాగే మురళీ శర్మ కూడా తన రోల్ కు న్యాయం చేకూర్చారు. ఇంకా ఇతర పాత్రల్లో కనిపించిన భద్రం, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు తమ రోల్స్ పరిధి మేరకు తమ మార్క్ నటన కనబరిచారు.

సినిమాలో ఎమోషన్ పాయింట్ కానీ సున్నితమైన కథాంశం కానీ చాలా సున్నితంగా బాగుంటాయి. పైగా కాస్త రొటీన్ అండ్ బోర్ కొట్టించే సీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అలాగే మెయిన్ లీడ్ నడుమ కెమిస్ట్రీ జెనరేట్ చేసేందుకు ఇంకా మంచి కథనం అల్లి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కానీ సాంకేతిక వర్గ పనితనం కానీ నీట్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా టెక్నీకల్ టీం లో సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఇచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగున్నాయి తన వల్ల సినిమా మరింత ఇంపాక్ట్ గా అనిపిస్తుంది.

ఈ "చావు కబురు చల్లగా" లోని కనిపించే కథ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే కార్తికేయ సాలిడ్ పెర్ఫామెన్స్ లావణ్య త్రిపాఠి రోల్ అలాగే ఈ చిత్రంలో కీలక ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి కానీ కొన్ని రొటీన్ బోరింగ్ సన్నివేశాలు అక్కడక్కడా డల్ గా సాగే కథనం ఈ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories