బూతు సినిమాకు చెక్ పెట్టిన సెన్సార్ బోర్డ్

బూతు సినిమాకు చెక్ పెట్టిన సెన్సార్ బోర్డ్
x
Highlights

మోతాదుకు మించిన అడల్ట్ కంటెంట్ తో తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 'ఇరట్టు అరయిల్ మురట్టు కుత్తుమ్'. ఇప్పుడు అదే సినిమాను తెలుగు లో 'చీకటి...

మోతాదుకు మించిన అడల్ట్ కంటెంట్ తో తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 'ఇరట్టు అరయిల్ మురట్టు కుత్తుమ్'. ఇప్పుడు అదే సినిమాను తెలుగు లో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే టైటిల్ తో రీమేక్ చేసి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అదిత్ అరుణ్, మిర్చి హేమంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి బోలెడు తిప్పలు తప్పవని అర్థమవుతుంది. అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఒకటో రెండో సీన్లు అసభ్యకరంగా ఉంటే వాటిని తీసేసి విడుదల చేయమని చెప్పొచ్చు కానీ సినిమా మొత్తం అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులతో అసభ్యకరంగా ఉండటంతో సెన్సార్ సభ్యులు విడుదలకు నిరాకరిస్తున్నారు. కొన్ని సీన్లు తొలగించేందుకు సిద్ధంగానే ఉన్నామని చిత్రయూనిట్ ఎంత మొత్తుకుంటున్నా, సెన్సార్ బోర్డు మాత్రం కనికరించడం లేదు. సినిమాలో ప్రతి సీన్ యూత్ ఆడియన్స్ ను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో చిత్రయూనిట్ కు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానం సర్వత్రా రేకెత్తుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories