Vijayakanth: డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూత

Captain DMDK Chief Vijayakanth Passed Away
x

Vijayakanth: డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూత

Highlights

Vijayakanth: చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Vijayakanth: డీఎండీకే అధినేత, కెప్టెన్ విజయ్‌కాంత్‌ మృతి చెందారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారింగా వెల్లడించింది. అయితే విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు ఏర్పడుతుండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా విజయకాంత్‌ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories