Actress: అందంగా ముస్తాబైన ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? అచ్చ తెలుగు ముద్దుగుమ్మ

Actress: అందంగా ముస్తాబైన ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? అచ్చ తెలుగు ముద్దుగుమ్మ
x
Highlights

Can you guess this telugu actress in this photo: సోషల్‌ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫొటోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు...

Can you guess this telugu actress in this photo: సోషల్‌ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫొటోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు స్వయంగా తమ చిన్ననాటి ఫొటోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతుంది. పైన ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఎర్ర చీరలో అందంగా తయారైన ఈ చిన్నారి ఇప్పుడు ఒక స్టార్‌ హీరోయిన్. ఎంతకీ ఈ క్యూట్‌ గర్ల్‌ ఎవరో గుర్తుపట్టారా?


టాలీవుడ్‌లో ఉన్న అతికొద్ది మంది తెలుగు అమ్మాయిల్లో ఈ బ్యూటీ ఒకరు. తెలుగుకే పరిమితం కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తన సహజ నటనతో ఆడిపాడింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ వెంకటేష్‌ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇంతకీ చిన్నారి ఎవరో ఈపాటికే మీకు ఓ ఐడియా వచ్చి ఉంటుంది కదూ! అవును ఈ హీరోయిన్‌ మరెవరో కాదు అందాల తార అంజలి.


20006లో వచ్చిన 'ఫొటో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. ఆ తర్వాత మాత్రం తెలుగు మూవీస్‌లో పెద్దగా నటించలేదు. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. 2012లో వచ్చిన సీతామ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. తాజాగా గేమ్‌ ఛేంజర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు తమిళంలో మరో సినిమాలో నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories