Raj Kundra: రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు

Businessman Rajkundra Got Bail from Metropolitan Court
x

రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

* రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు * పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా

Raj Kundra: పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈనెల 19న కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు రాజ్‌కుంద్రా. తనపై ఒక్క ఆధారం కూడా లేదని, తనను ఈ కేసులో బలిపశువుగా మార్చారని ఛార్జ్‌షీట్‌లో వాపోయాడు రాజ్‌కుంద్రా. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇటీవల రాజ్‌కుంద్రా, మరో ముగ్గిరిపై అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను వంచించి రాజ్‌కుంద్రా పెద్ద ఎత్తున ఆర్జించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో విచారణ ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలంటూ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు రాజ్‌కుంద్రా. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories