#BoycottSaiPallavi ఎందుకు ట్రెండ్ అవుతోంది... ఆమె చేసిన కామెంట్స్ ఏంటి?
బాయ్ కాట్ సాయిపల్లవి అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ విషయంలో ఆమె చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని నెటిజన్లు ఆమెను బాయ్ కాట్ చేయాలని కోరుతున్నారు
బాయ్ కాట్ సాయిపల్లవి అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ విషయంలో ఆమె చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని నెటిజన్లు ఆమెను బాయ్ కాట్ చేయాలని కోరుతున్నారు. అక్టోబర్ 31న ఆమె నటించిన అమరన్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ ఆర్మీ అధికారి భార్యగా ఆమె నటించారు. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు.
అసలు ఏం జరిగింది?
పాకిస్తాన్ లో ఉండే వాళ్లకు ఇండియన్ ఆర్మీ టెర్రరిస్టులుగా కన్పిస్తోంది. ఇక్కడ ఉండే వాళ్లకు పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులుగా కన్పిస్తారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2022లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అభిప్రాయాలను తప్పుబట్టారు. బాయ్ కాట్ సాయి పల్లవి అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
#BoycottSaiPallavi
— Davina Deva (DD) (@MissDD114) October 28, 2024
She's lead actress in a movie made on Major MukundVaradarajan,AC,who attained veergati in Shopian in 2014.The movie is adapted from the popular book series‘India’sMost Fearless:True Stories of Modern Military Heroes’by ShivAroor & RahulSingh. #SaiPallaviface pic.twitter.com/3P73J9Bc70
మేజర్ వరదరాజన్ మెమోరియల్ ను సందర్శించిన సాయి పల్లవి
మేజర్ ముకుంద్ వరదరాజన్ మెమోరియల్ ను సాయి పల్లవి సందర్శించారు. వరదరాజన్ కు ఆమె నివాళులర్పించారు. 2014లో కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో వరదరాజన్ మరణించారు. ఆయనకు మరణానంతరం భారత ప్రభుత్వం ఆశోకచక్రను ప్రకటించింది. అమరన్ సినిమా విడుదలకు ముందు వరదరాజన్ కు నివాళులర్పించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేశారు.
సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా 2022లో విడుదలైంది. ఈ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదంగా మారింది. ఈ వివాదంపై ఆమె అప్పట్లోనే వివరణ ఇచ్చారు. తాను ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆర్మీకి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేసి బాయ్ కాట్ సాయిపల్లవి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి ఈ వ్యాఖ్యలు ఆమె తాజాగా నటించిన అమరన్ సినిమాకు సంబంధం లేనివి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire