Ram Pothineni: యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ మొదలుపెట్టిన బోయపాటి

boyapati started filming the action scenes
x

యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ మొదలుపెట్టిన బోయపాటి

Highlights

* మొదటగా సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరగబోతోందట

Boyapati Srinu: యువ హీరో రామ్ పోతినేని కరియర్లో "ఇస్మార్ట్ శంకర్" తప్ప ఈ మధ్యకాలంలో పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఏమీ లేదు. ఈ మధ్యనే రామ్ హీరోగా నటించిన "ది వారియర్" సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తన ఆశలన్నీ రామ్ ఇప్పుడు తన తదుపరి సినిమా పైన పెట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది.

ఇక మొదటగా సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరగబోతోందట. మాస్ డైరెక్టర్ అని పేరు బోయపాటి శ్రీనుకి ఊరికే రాలేదు. మరి అలాంటి బోయపాటి శ్రీను రామ్ కోసం ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలోని ఫైట్ సన్నివేశాలు అదిరిపోయేలాగా రావాలని బోయపాటి శ్రీను యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టన్ శివ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

శివ కూడా సినిమాకి మంచి విజువల్స్ ను అందిస్తున్నారట. ఇక ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఇంటెన్సుగా ఉంటాయని, ప్రేక్షకులను అలరిస్తాయని కొందరు చెబుతున్నారు. "పెళ్లి సందడి" బ్యూటీ శ్రీ లీలా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మూవీస్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ మరియు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories