Bomb Threat : ఈ మధ్య స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ బాంబు పెట్టామంటూ కొందరు ఆకతాయిలు నుంచి ఫోన్ కాల్స్ రావడం సహజం అయిపొయింది.. ఆ మధ్య రజినీకాంత్, సూర్య, విజయ్ ఇళ్ళకి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Bomb Threat : ఈ మధ్య స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ బాంబు పెట్టామంటూ కొందరు ఆకతాయిలు నుంచి ఫోన్ కాల్స్ రావడం సహజం అయిపొయింది.. ఆ మధ్య రజినీకాంత్, సూర్య, విజయ్ ఇళ్ళకి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వెళ్ళడం, అక్కడికి వెళ్ళాక ఏమీ లేకపోవడం వంటివి జరుగుతున్నాయి.. అయితే ఆకతాయిలు చెప్పేది ప్రముఖుల పేర్లు కావడంతో పోలీసులు లైట్ తీసుకోవడం లేదు.. అయినప్పటికీ ఆకతాయిలు ఇలాంటివి మానుకోవడం లేదు!
తాజాగా ఇలాంటి సంఘటనే చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని ధనుష్ అభిరామపురం ఇంట్లో, విరుగంబక్కంలోని విజయకాంత్ ఇంట్లో బాంబ్ పెట్టామని ఎవరో పోలీసులకి కాల్ చేశారు. దీనితో ఉలిక్కిపడ్డ పోలీసులు అక్కడకి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఏమీ లేదని తేలింది. దీనితో కుటుంబ సభ్యులు, పోలీసులు, అభిమానులు ఒక్కసారిగా ఉపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలో ఇంట్లో బాంబ్ పెట్టామంటూ ఒకే వ్యక్తి కాల్ చేసినట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఒకే రోజు విజయకాంత్, ధనుష్ ఇళ్ళకు బాంబు బెదరింపులు రావటం తీవ్ర కలకలం సృష్టించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire