Kangana Ranaut Sensational Comments : కంగనా రనౌత్.. ఈ మధ్య నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా కంగనా మరోసారి
Kangana Ranaut Sensational Comments : కంగనా రనౌత్.. ఈ మధ్య నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని నోయడాలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశం పైన కంగనా మాట్లాడుతూ.. "దేశంలో నెంబర్ వన్ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని అందరూ భావిస్తుంటారు.. కానీ అదంతా గతం... ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది. తరుచూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ హిందీ చిత్ర పరిశ్రమకు సవాలు విసురుతోంది.
చాలా వరకు హిందీ సినిమాలు అన్ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్ జరుపుకుంటాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు ఒక్కటై భారతీయ సినీ పరిశ్రమగా ఏర్పడాలి. మనదేశంలో ఒక్కో భాషకు ఒక్కో ఇండస్ట్రీ ఉండటం వల్ల హాలీవుడ్ లాభపడుతోంది అని కంగనా ట్వీట్ చేసింది.
People's perception that top film industry in India is Hindi film Industry is wrong. Telugu film industry has ascended itself to the top position and now catering films to pan India in multiple languages, many hindi films being shot in Ramoji Hydrabad 1/2 https://t.co/zB6wkJg1zX
— Kangana Ranaut (@KanganaTeam) September 19, 2020
అటు కంగనా మహారాష్ట్ర ప్రభుత్వం పైన, ముంబై పోలిసుల పైన ఇటివల కామెంట్స్ చేసి నిత్యం వార్తల్లో నిలిచింది. ఆమె చేసిన ఈ వాఖ్యలు చాలా దుమారాన్నే లేపాయి.. ఆమె చేసిన వాఖ్యలకి గాను శివసేన నేతలు కూడా భారీగానే కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఆమె నివాసాన్ని BMC అధికారులు అక్రమంగా ఉందంటూ కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై హైకోర్టు కంగనా ఆఫీసును కూల్చొదంటూ స్టే విధించింది. మహారాష్ట్రలో పరిస్థితి ఒక్కసారిగా కంగానా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వంగా మారిపోయింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire