Kangana Ranaut leaves Mumbai : గత కొద్దిరోజులుగా బాలీవుడ్ లో ఎక్కడ చూసిన కంగనా పేరే వినిపిస్తుంది. మహారాష్ట్ర సర్కార్ పైన తీవ్ర వాఖ్యలు
Kangana Ranaut leaves Mumbai : గత కొద్దిరోజులుగా బాలీవుడ్ లో ఎక్కడ చూసిన కంగనా పేరే వినిపిస్తుంది. మహారాష్ట్ర సర్కార్ పైన తీవ్ర వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచింది ఈ భామ.. తాజాగా భారమైన హృదయంతో ముంబయి వీడుతున్నట్టుగా కంగనా వెల్లడించింది. ఈ మేరకి ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "బరువైన హృదయంతో ముంబైని వీడుతున్నా. గత కొన్ని రోజులుగా నా మీద దాడులు చేయడం, నా మీద దూషణలు చేయడం, నా కార్యాలయం తర్వాత నా ఇంటిని కూల్చివేయడానికి ప్రయత్నం చేయడం, నాకు కమాండోలు రక్షణనివ్వడం... వీటన్నింటినీ చూసిన తర్వాత నేను ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) అనడం సరైనదే అని భావిస్తున్నా" అని ఆమె విమానాశ్రయానికి వెళుతున్నప్పుడు ట్వీట్ చేసింది. కాగా కంగనా సెప్టెంబర్ 9న ముంబయికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
With a heavy heart leaving Mumbai, the way I was terrorised all these days constant attacks and abuses hurled at me attempts to break my house after my work place, alert security with lethal weapons around me, must say my analogy about POK was bang on. https://t.co/VXYUNM1UDF
— Kangana Ranaut (@KanganaTeam) September 14, 2020
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై ముంబై పోలీసులను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చింది కంగనా రనౌత్.. అందులో భాగంగానే ముంబైని పివోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)తో పోల్చుతూ ఇక్కడ బ్రతకాలంటే భయంగా ఉంది అంటూ కీలక వాఖ్యలు చేసింది. అనంతరం శివసేన పార్టీ నేతలు మే ఫైర్ అయ్యారు. ఆ తర్వాత తనకి ప్రాణాలకి ముప్పు ఉంది అనగా కేంద్రాన్ని సహాయం కోరగా కేంద్రం ఆమెకి 'వై' లెవల్ సెక్యూరిటీని కల్పించింది.
ఆమె వెకేషన్ నుంచి వచ్చేసరికి మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి పాలీహిల్‌లోని ఆమె కార్యాలయం అక్రమ కట్టడమని పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. దీనితో కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అటు బీఎంసీ అధికారులు తన కార్యాలయాన్ని కూల్చివేయడం పట్ల కంగనా నిన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కౌశ్యారితో భేటి అయింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire