Aishwarya Rai Bachchan and her daughter Aaradhya Tests Positive for Covid-19: బిగ్ బీ కోడలు, మనవరాలికీ కరోనా పాజిటివ్..

Aishwarya Rai Bachchan and her daughter Aaradhya Tests Positive for Covid-19: బిగ్ బీ కోడలు, మనవరాలికీ కరోనా పాజిటివ్..
x
Aradhya Bachchan and Aishwarya Rai Bachchan (File Photo)
Highlights

Aishwarya Rai Bachchan and her daughter Aaradhya Tests Positive for Covid-19: బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు వరుసగా కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు.

Aishwarya Rai Bachchan and her daughter Aaradhya Tests Positive for Covid-19: బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు వరుసగా కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. శనివారం అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ రిపోర్టులు రాగా.. ఆదివారం మాత్రం కోడలు, అభిషేక్ భార్య, మనవరాలు ఆధ్య (అభిషేక్, ఐశ్వర్య దంపతుల కూతురు) కూడా కరోనా సోకింది. నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు కూడా కరోనావైరస్ నిర్ధారణ అయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వాస్తవానికి శనివారమే వీరికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది, అయితే ఆదివారం చేసిన RTPCR టెస్ట్ లలో కరోనా పాజిటివ్ అని ఇద్దరికి నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు.. జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి నివేదికలు మాత్రం నెగటివ్ అని వచ్చాయి.

కాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ తనకు కోవిడ్ 19 అని తేలిందని, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు కూడా కరోనావైరస్ పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. అయితే కాసేపటికే కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా సోకినట్టు వార్త వెలువడింది. దాంతో బాలీవుడ్ అంతా ఉలిక్కిపడింది. ఇప్పుడు ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె కరోనా భారిన పడటంతో అభిమానులు షాక్ లో మునిగిపోయారు.



Show Full Article
Print Article
Next Story
More Stories