Amitabh Bachchan on Abhishek Bachchan Health : అదే నాకు బాధగా ఉంది: అమితాబ్‌

Amitabh Bachchan on Abhishek Bachchan Health : అదే నాకు బాధగా ఉంది: అమితాబ్‌
x
Amitabh Bachchan ,Abhishek Bachchan (File Photo)
Highlights

Amitabh Bachchan on Abhishek Bachchan Health : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం

Amitabh Bachchan on Abhishek Bachchan Health : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కోరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్న (ఆదివారం) అమితాబ్ బచ్చన్ కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్నీ అభిషేక్ బచ్చన్ వెల్లడించారు.

ఇక కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకొని ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కానీ ఇది పూర్తి సంతోషం మాత్రం కాదని అన్నారు. అభిషేక్ బచ్చన్ కి తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని రావడం బాధగా ఉందని అన్నారు. ఇక తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అటు బిగ్ బీ కరోనాని జయించడం పట్ల అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో కరోనాని జయిస్తా : అభిషేక్

తాజాగా జరిపిన కొవిడ్-19 పరీక్షలో తనకి దురదృష్టవశాత్తు మళ్లీ కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం నేను హాస్పిటల్‌లోనే ఉన్నానని, నేను ఈ కరోనాను నేను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను ప్రామిస్ అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. అటు అభిమానులు కూడా అభిషేక్ కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories