Bloody Beggar: తెలుగులో విడుదలకు సిద్ధమైన 'బ్లడీ బెగ్గర్‌'.. రిలీజ్‌ ఎప్పుడుంటే..

Bloody Beggar
x

Bloody Beggar

Highlights

Bloody Beggar: మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు.

Bloody Beggar: మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇతర భాషల్లో తెరకెక్కి తెలుగులో మంచి విజయాన్ని సాధించిన ఎన్నో చిత్రాలు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల ఈ ట్రెండ్‌ ఎక్కువతోంది. ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

కోలీవుడ్‌ టాలెంటెడ్‌ నటుడు కవిన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం బ్లడీ బెగ్గర్. ఈ సినిమాను శివ బాలన్ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు స్టార్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్ కుమార్ నిర్మాణ బాధ్యతలను తీసుకోగా ఫిలమెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ నిర్మితమవుతోంది దీపావళి పండుగకు తమిళ్ వెర్షన్‌ థియేటర్లలో విడుదలై మంచి మౌత్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ విడుదల తేదీ కూడా ఖరారైంది తెలుగులో బ్లడీ బెగ్గర్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.

ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఏసియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ ద్వారా అందించనున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ పీక్ పేరుతో విడుదలైన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది జెన్‌ మార్టిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ ప్రాజెక్ట్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తొలి ప్రొడక్షన్‌ వెంచర్‌ కావడం మరో విశేషం బ్లడీ బెగ్గర్ కథ దర్శకత్వం నిర్మాణం సంగీతం వంటి అన్ని విభాగాల్లో భారీగా అంచనాలు పెట్టిన ఈ చిత్రం దాని ప్రత్యేకతను చాటుకుంటోంది కవిన్‌ తన నటనతో, వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories