సినిమా స్టార్లతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్న కేంద్ర సర్కార్.. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అందులో భాగమేనా..

BJP Plans for Promotion With Film Actors
x

సినిమా స్టార్లతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్న కేంద్ర సర్కార్.. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అందులో భాగమేనా.. 

Highlights

Amit Shah: రాజకీయ, సినీ వర్గాల్లో ఎంతో ఉత్కంఠను రేపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా-ఎన్టీఆర్‌ల భేటీ చివరికి సింపుల్‌గా ముగిసింది.

Amit Shah: రాజకీయ, సినీ వర్గాల్లో ఎంతో ఉత్కంఠను రేపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా-ఎన్టీఆర్‌ల భేటీ చివరికి సింపుల్‌గా ముగిసింది. రాజకీయాల గురించి పెద్దగా చర్చ జరగలేదని స్వయంగా బీజేపీ నాయకులే తేల్చిచెప్పారు. ప్రదానంగా ఎన్టీఆర్ నటన, సినిమాల గురించిన చర్చ మాత్రమే అమిత్ షా భేటీలో జరిగినట్లు తెలుస్తోంది. దాంతో పాటు పాటు ఎన్టీఆర్‌ను, కొన్ని విషయాలలో సపోర్ట్ కావాలని అమిత్ షా కోరినట్లుగా తెలుస్తొంది.

అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ విషయం బయటకు రాగానే, దానిపై రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎన్టీఆర్ నటన, సినిమాలకు సంబందించిన ప్రస్తావనే వారి మధ్య జరిగిందని తెలుస్తొంది. భేటీ ముగిసిన అనంతరం అమిత్ షా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది అంటూ అమిత్ షా ట్వీట్ లో పేర్కొన్నారు. దానికి బదులుగా ఎన్టీఆర్ కూడా తన ఆనందాన్ని ట్వీట్ తోనే షేర్ చేసుకున్నారు. అయితే అసలు అమిత్ షా ప్రత్యేకంగా ఎన్టీఆర్‌ను కలవడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనేది సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోను ఆసక్తిగా మారింది.

ఈమధ్య కాలంలో నార్త్‌లో పలువురు సినీ నటులతో బీజేపీ కొన్ని ప్రమోషనల్ స్టంట్‌లను నిర్వహించి, తమకు అనూకులంగా కొన్ని ఓట్లను పొందిన నేపథ్యంలో దక్షిణాదిలో కూడా అదే తరహా చర్యలకు సిద్దమైందన్న చర్చలు చిత్ర పరిశ్రమలో హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ‌తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను, తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి క్రేజీ స్టార్స్ సపోర్ట్ తీసుకుని బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో తాను మరణించే వరకు టీడీపీకే సేవలందిస్తానని జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు అమిత్ షాతో భేటీ కావడం సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఎన్టీఆర్‌ గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉంటాడా లేక తనకు ప్రాధాన్యతనిచ్చిన బీజేపీకి అనూకూలంగా మారతాడా అనేది ప్రశ్నార్థికంగా మారింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరోను అమిత్ షా లాంటి పెద్ద వ్యక్తి కలిసి మాట్లాడటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories