Koratala Siva Birthday: వినోదం.. సందేశం రెండిటితో ఘాటైన సినిమాలు కొరటాలకే సాధ్యం!

Koratala Siva Birthday: వినోదం.. సందేశం రెండిటితో ఘాటైన సినిమాలు కొరటాలకే సాధ్యం!
x
Highlights

కొరటాల శివ.. తెలుగు చిత్ర పరిశ్రమలో రచయతగా తన సినీ ప్రస్థానం ప్రారంభించాడు.

కొరటాల శివ.. తెలుగు చిత్ర పరిశ్రమలో రచయతగా తన సినీ ప్రస్థానం ప్రారంభించాడు. బోయపాటి శ్రీను దర్సకత్వం లో వచ్చిన 'భద్ర, సినిమా ద్వారా కథా రచయితగా తన తోలి సినిమాను చేసాడు. 1995 జూన్ 15వ తేదీన జన్మించారు కొరటాల శివ. ఈ సందర్బంగా అయన కెరీర్ ను చూద్దాం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్ర పరిశ్రమపై ఆసక్తితో పరిశ్రమకి ఎంట్రి ఇచ్చి రచయిత పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్ గా చేరారు. ఆ తరువాత చాల సినిమాలకు రైటర్ గా కూడా పనిచేసారు. అందులో ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్సకత్వం వహించిన 'భద్ర' సినిమాకి కథా రచయితగా పనిచేసారు. తరువాత ఎన్నో సినిమాలకు మాటల రచయితగా, కథా రచయితగా పనిచేసారు.

2013లో యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్, అనుష్క శెట్టి హీరో హీరొయిన్ గా 'మిర్చి' చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంతో కొరటాలకు ప్రసంసలు దక్కాయి. తరువాత మహేష్ బాబుతో 'శ్రీమంతుడు', జూ.ఎన్టీఆర్ తో 'జనతాగ్యారేజ్', 'భరత్ అనే నేను' సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకుని ఓటమి ఎరుగని దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులలో ఒకరిగా నిలిచారు.

ప్రస్తుతం కొరటాల చిరంజీవితో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి సినిమా విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ త్రిషను అనుకోగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.. అయితే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ ఖైదీ150లో నటించింది. మరోసారి ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కరోన వైరస్, లాక్ డౌన్ కారణం గా చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు నిలిచిపోయి. లాక్ డౌన్ ముగియగానే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ' ఆచార్య' చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నాటు తెలుస్తుంది. కొరటాల శివ ఇలాగే మరిన్ని సినిమాలు చేసి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది హెచ్.ఎం. టీ.వీ.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories