మోనాల్‌ను ఏడిపించిన అరియానా

మోనాల్‌ను ఏడిపించిన అరియానా
x
Highlights

మహారాణి కిరీటం ధరించిన అరియానా ఇంట్లోవాళ్లకు ఓ టాస్క్‌ ఇచ్చింది. నచ్చిన వస్తువు తీసుకొచ్చి.., దానికి సంబంధించిన జ్ఞాప‌కాన్ని పంచుకోవాలని ఆదేశించింది. అలాగే దాన్ని ఇంట్లో నచ్చినవాళ్లకు ఇవ్వాలని చెప్పింది

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌.. చివరి దశకొచ్చేసరికి అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది. ఎవరు విజేత అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసలే ఫైనల్ స్టేజ్‌ ఉండటంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకూడదని గట్టిగానే గేమ్ ఆడుతున్నారు ఇంటిసభ్యులు. ఇక రెండు రోజులుగా సైలెంట్‌గా ఉన్న హౌస్‌ ఇంటిసభ‌్యుల తీరుతో మరోసారి దద్దరిల్లింది.

రాజారాణి టాస్క్‌లో ఇంటిసభ‌్యులు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జనాలను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. వినోదాన్ని పంచేందుకు మోనాల్‌ అందరిలా కాకుండా కాస్త భిన్నంగా అభిజిత్‌-సోహైల్‌ను ప్రేమికులుగా మార్చి ఫన్నీ టాస్క్‌ చేయించింది.

మహారాణి కిరీటం ధరించిన అరియానా ఇంట్లోవాళ్లకు ఓ టాస్క్‌ ఇచ్చింది. నచ్చిన వస్తువు తీసుకొచ్చి.., దానికి సంబంధించిన జ్ఞాప‌కాన్ని పంచుకోవాలని ఆదేశించింది. అలాగే దాన్ని ఇంట్లో నచ్చినవాళ్లకు ఇవ్వాలని చెప్పింది. దీంతో సోహైల్‌ తన గుర్తుగా అభిజిత్‌కు సస్పెండర్‌, హారికకు కత్తి, మోనాల్‌కు టీ షర్ట్‌, అరియానాకు పర్ఫ్యూమ్‌, అఖిల్‌కు జాకెట్‌ను ఇచ్చాడు.

మహారాణిగా బాధ్యతలు చేపట్టిన మోనాల్‌ తనలో మంచీచెడు ఏంటో చెప్పమని మంత్రి అఖిల్‌ను అడిగింది. ఒక మనిషి నిన్ను ద్వేషించినా కూడా ఇష్టపడటం మంచి లక్షణమైతే.. సంతోషంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం చెడు లక్షమని చెప్పాడు. అలాగే తనతో ఉన్నట్లుగా వేరే అబ్బాయితో ఉంటే తనకు నచ్చదని మనసులోని మాటను మోనాల్‌తో చెప్పాడు అఖిల్‌.

అనంతరం మోనాల్‌ స్కిట్‌ చేయమని ఆదేశించింది. అందులో భాగంగా అభిజిత్‌ అమ్మాయిగా నటిస్తూ సోహైల్‌ను పార్టీకి ఒప్పించాల్సి ఉంటుంది. కానీ.. మధ్యలో అరియానా, హారిక కూడా దూరడంతో స్కిట్టు ఆగమాగం అయింది. కాసేపు నవ్వించినప్పటికీ ఎటూ తేలకుండా స్కిట్‌ మధ్యలోని ఆగిపోయింది.అధికారం టాస్క్‌లో అరియానా విజృంభించింది. అనుకున్నట్లుగానే ఆమె బెస్ట్‌ రూలర్‌గా నిలిచింది. అధికారం టాస్క్‌లో గొడవ పడ్డ అఖిల్‌-సోహైల్‌.. మోనాల్‌ ప్రయత్నంతో కలిసిపోయారు. అటు అభి రాసిన లెటర్‌ను చూసిన హారిక చలించిపోయింది. అనంతరం ఇంటిసభ్యులకు "ఓపిక" అనే రెండో టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

అధికారం టాస్కులో అరియానా బెస్ట్‌ రూలర్‌గా ఎంపికైంది. దీంతో కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన ఆమె కన్నీటిపర్యంతమైంది. ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడిన అరియానా.. తనకు ఓటేసి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది.హారిక రాజ్యంలో జరిగిన గొడవతో అఖిల్‌, సోహైల్‌కు సరిగా మాటల్లేవు. ఈ అన్నదమ్ములను కలిపేందుకు మోనాల్‌ తన వంతు ప్రయత్నించగా చివరికి వాళ్లు కలిసిపోయారు. ఇక అభిజిత్‌ హారికను ఎంత మిస్సవుతున్నాడో చెప్పకనే చెప్పాడు. తనతో టైమ్‌ స్పెండ్‌ చేయమని చెప్తూ ఓ లేఖను హారిక బెడ్‌పై పెట్టాడు. అది చూసి ఆమె చలించిపోయింది.

కంటెస్టెంట్లు వారేంటో నిరూపించుకునేందుకు బిగ్‌బాస్‌ " ఓపిక" అనే రెండో టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంటు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వకుండా రోబోలా కూర్చోవాలి. అరియానాతో టాస్క్‌ మొదలవగా ఆమెను ఇరిటేట్‌ చేసేందుకు సోహైల్‌ విశ్వప్రయత్నాలు చేశాడు. ఇక మోనాల్‌ ఆమెకిష్టమైన చింటూ బొమ్మను విసిరేసింది.

"ఓపిక" టాస్క్‌లో మోనాల్‌, అరియానా మధ‌్య మళ్లీ గొడవలు రాజుకున్నాయి. తన బొమ్మను పడేసినందుకు అరియానా.. మోనాల్‌ను నోటికొచ్చినట్లు తిట్టింది. దీంతో ఆమె గుక్కపెట్టి ఏడవగా ఓదార్చేందుకు ఎవరూ లేకపోవడంతో మరీ దారుణంగా అనిపించింది. కానీ.. టాస్క్‌ ముగిశాక సోహైల్‌.. మోనాల్‌ బాధను చూసి తట్టుకోలేకపోయాడు.

మోనాల్‌ రోబోలా కూర్చోగా అరియానా తన మనసులో ఉన్నదంతా కక్కేసింది. అవినాష్‌ను తన్ని మరీ ఓ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చావని చెప్పింది. తన మీద ఎంత పగుందో బయటపడిందని తెలిపింది. ఒక్కో అంశాన్ని బాణాల్లా వదులుతూ ఆమె మనసును గాయపర్చింది.టాస్క్‌ పూర్త‌వ‌గానే మోనాల్ లోప‌ల‌కు వెళ్లి ఒంట‌రిగా ఏడ్చేసింది. గేమ్ ఆడినా ఆడ‌క‌పోయినా ప్రాబ్ల‌మే అని దుఃఖించింది.

సోఫాలో ఒంట‌రిగా గుక్క‌పెట్టి మ‌రీ ఏడ్చింది. బిగ్‌బాస్‌ మోనాల్‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచాడు. దీంతో అక్కడ ఆమె తన బాధ చెప్పుకుంది. ప్రతిసారి ఎలిమినేషన్‌లా అనిపిస్తోంది అని తన గుండెల్లో రగులుతున్న బాధను బయటపెట్టింది. దీంతో బిగ్‌బాస్‌ ఆమెకు ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories