సోహైల్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించిన అరియానా!

సోహైల్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించిన అరియానా!
x
Highlights

అఖిల్‌ మినహా అందరూ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోండంటూ ఇంటిసభ్యులకు 'అధికారం' అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో రాజు, రాణి అయ్యేవాళ్లు బిగ్‌బాస్‌ రూల్స్‌ను మార్చుతూ సొంత నియమాలు పెట్టొచ్చని చెప్పాడు.

చూస్తుండగానే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ప్రారంభమై పదమూడు వారాలు గడిచిపోయాయి. గ్రాండ్‌ ఫినాలేకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉన్నాయి. దీంతో ట్రోఫీ అందుకోవాలన్న కసితో కంటెస్టెంట్లు ఆట మీద ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా ఎమోషన్స్‌, గేమ్‌ రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ఆడుతున్నారు.

హౌస్‌లోని ఇంటిసభ్యులను నువ్వు-నేను సినిమాలోని సాంగ్‌ ప్లే చేసి నిద్రలేపారు బిగ్‌బాస్‌. ఈ పాటకు గార్డెన్‌ ఏరియాలో అఖిల్‌-మోనాల్‌ కలిసి డ్యాన్స్‌ చేయగా.., అరియానా, సోహైల్‌, హారిక తమదైన శైలిలో కాలు కదిపారు. కెమెరా దగ్గరకు వెళ్లిన అరియానా.. ప్యాలెస్‌లో ఉండాలన్న కల ఎట్టకేలకు తీరిందని బిగ్‌బాస్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంది.

అఖిల్‌ మినహా అందరూ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోండంటూ ఇంటిసభ్యులకు 'అధికారం' అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో రాజు, రాణి అయ్యేవాళ్లు బిగ్‌బాస్‌ రూల్స్‌ను మార్చుతూ సొంత నియమాలు పెట్టొచ్చని చెప్పాడు. ఈ టాస్క్‌లో అఖిల్‌ మంత్రిగా వ్యవహరిస్తాడు. మొదట బజర్‌ మోగగానే కిరీటాన్ని అందుకుని సోహైల్‌ రాజుగా అవతరించాడు.

కిచెన్‌ దగ్గర పడేసి ఉన్న బోళ్లు తోమమని అరియానాను ఆదేశించాడు రాజుగా అవతారమెత్తిన సోహైల్‌. అటు మంత్రితో మసాజ్‌ చేయించుకున్నాడు. ఇక హారికతో ఫ్రూట్స్‌ తినిపించుకున్నాడు. ఈ క్రమంలో మీరే దయతలచి అఖిల్‌కు, తనకు పెళ్లి చేయాలని రాజాను అభ్యర్థించింది హారిక.

బిగ్‌బాస్‌ ఇచ్చిన రాజారాణి టాస్కులో అదృష్టం హారికను వరించింది. దీంతో హౌస్‌లో ఆమె మహారాణిగా కొలువు దీరింది. ముఖ్యంగా హారికను అఖిల్‌ ముద్దివ్వమని బతిమాలాడటం మరీ దారుణంగా అనిపించింది. ఫైనల్‌గా అరియానాను ఏడిపించాలనుకున్న సోహైల్‌ కల మాత్రం నెరవేరలేదు.

అరియానా చేస్తున్న అతిని తట్టుకోలేక రాజే స్వయంగా ఆమె ముఖాన టమాటలు రుద్దాడు. దీంతో మరింత రెచ్చిపోయిన అరియానా అరుపులు, కేకలతో హౌస్‌ను దద్దరిల్లేలా చేసింది. అరియానా అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆమె నెత్తి మీద నీళ్లు గుమ్మరించాడు. ఇక ఆమె వేసే జింతాత జింతాత స్టెప్పులో తనకు ఫ్యూచర్‌ కనిపిస్తుందని సోహైల్ భయపడ్డాడు. ఇంతలో సోహైల్‌ గడువు ముగిసింది. దీంతో అతడు తన కిరీటాన్ని అభిజిత్‌కు అప్పగించాడు.

తన రాజుగా ఉన్నంతకాలం హారిక మాటకు ముందోసారి, చివరోసారి ఇకిలి పికిలి అనే పదాన్ని ఉపయోగించాలని అభిజిత్‌ హారికను ఆదేశించాడు. తర్వాత మోనాల్‌ పాట పాడగా దానికి సోహైల్‌, అరియానా రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేశారు. అభిజిత్‌ గడువు ముగియగానే.. హారిక మహారాణిగా మారింది.

తను చెప్పినవి చేయకపోతే బట్టలు స్విమ్మింగ్‌ పూల్‌లో పడేస్తానని సోహైల్‌ను హెచ్చరించింది హారిక. దీంతో అంత పని చేయొద్దంటూ ఆమెను కూల్‌ చేసేందుకు సోహైల్‌ ముద్దు పెట్టాడు. అక్కడే ఉన్న అఖిల్‌ ఛాన్సు వదిలేది లేదనుకుని.. తనకు కూడా పెట్టాల్సిందేనని పట్టుపడ్డాడు. కానీ.. రాణి కాలం ముగిశాఖ పెడ్తానని చెప్పి హారిక ఆ సమయానికి తప్పించుకుంది.

హారిక రాణిగా మారడంతో హౌస్‌లో గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా హారిక, అఖిల్‌ ప్రవర్తించిన తీరు సోహైల్‌కు నచ్చలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సోహైల్‌.. హారికకు వార్నింగ్‌ ఇచ్చినంత పనిచేశాడు. మొత్తానికి తన కోపాన్ని వస్తువుల మీద తీస్తూ కుర్చీని విసిరిగొట్టాడు.

అభిజిత్‌.. హారికను పొగిడినట్లే పొగిడి ఇదంతా అబద్ధమని ఝలక్‌ ఇవ్వగా ఆగ్రహించిన రాణి అతడి బట్టలను స్విమ్మింగ్‌ పూల్‌లో పడేసింది. తర్వాత పువ్వుతో నాన్‌స్టాప్‌గా ప్రపోజ్‌ చేయాలని సోహైల్‌ను ఆదేశించింది. ఇది చాలా ఈజీ అని అఖిల్‌ చెప్పడంతో హారిక మరో టాస్క్ ఇచ్చి దాన్ని 15 సెకన్లలో పూర్తి చేయాలంది. దీంతో తిక్క లేచిన సోహైల్‌ బాడీ లాంగ్వేజే మారిపోయింది.

సోహైల్‌ కోపంలో ఉన్నాడని తెలిసినా కూడా రాణి హారిక పట్టించుకోకుండా షూల లేస్‌ను కలిపి కట్టుకొని డ్యాన్స్‌ చేయాలంది. దీంతో ఆమె ముందు గాల్లోకి లేస్తూ డ్యాన్స్‌ చేసిన సోహైల్‌ లోపలకు వచ్చి తన ఉక్రోషాన్ని వెల్లగక్కాడు. మంత్రిగా మధ్యలో ఎందుకు దూరుతున్నాడని సోహైల్‌ ఆగ్రహించాడు. తాను రాజుగా ఉన్నప్పుడు ఒక్క పని చేయలేదు కానీ.. హారిక రాణిగా ఉన్నప్పుడు మాత్రం అన్నీ పనులు చేస్తున్నాడని అఖిల్‌ మీద మండిపడ్డాడు. ఇక అఖిల్‌ పాటకు అరియాన డ్యాన్స్‌ ఇరగదీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories