Pallavi Prashanth: పరారీలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్... పోలీసుల గాలింపు

Bigg Boss Winner Pallavi Prashanth is Absconding
x

Pallavi Prashanth: పరారీలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్... పోలీసుల గాలింపు

Highlights

Pallavi Prashanth: ప్రశాంత్ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు

Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ ని ప్రకటించిన రోజు అనగా షో గ్రాండ్ ఫినాలే నిర్వహించిన డిసెంబర్ 17, ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియో ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రన్నరప్ అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని.. రణరంగం సృష్టించారు. కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేయడం మాత్రమే కాక.. అమర్ దీప్ వెంటపడి తరిమి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పైగా ప్రభుత్వ ఆస్తులైన ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. జరిగిన అల్లర్ల మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నారాయణ వంటి నేతలు ఖండించారు. అంతేకాక అల్లర్లకు బాధ్యుడంటూ బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో తాజాగా పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్‌ బిగ్గ బాస్ సీజన్ 7 విన్నర్ గా, అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌రోడ్‌ నం. 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్‌దీప్‌ను విజేతగా ప్రకటించకపోవడంతో అతడి అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్‌దీప్‌ కారును ధ్వంసం చేశారు. అలానే ఇతర కంటెస్టెంట్ల కార్లను కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ పని చేసింది ఎవరి ఫ్యాన్స్ అన్నది తెలియలేదు.

ఈ సందర్భంగా అమర్, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇరువురు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్‌ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ పల్లవి ప్రశాంత్‌ మాత్రం అటు పోలీసుల ఆదేశాలను, ఇటు బిగ్‌బాస్‌ యాజమాన్యం సూచనలను పట్టించుకోకుండా.. గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్‌ టాప్‌ జీప్‌పై చేరుకోవడంతో చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్ల మీద కూడా దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. మొత్తంగా అల్లర్లకు కారకుడైన పల్లవి ప్రశాంత్‌ మీద జూబ్లీహిల్స్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్‌ మంగళవారం నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని ప్రశాంత్ స్వగ్రామానికి పంపించారు. అంతేకాక అతడి కారు డ్రైవర్‌ సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్‌ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.

అంతేకాక ప్రశాంత్ అనుచరుల ఫోన్‌ డేటాను సేకరించారు పోలీసులు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్‌ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల మీద రాళ్లు వేసిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నట్లుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories