Bigg Boss 8 Telugu, Day 93: బిగ్‌బాస్‌లో మొదలైన ఓటింగ్‌ రిక్వెస్ట్‌.. ఈ వారమంతా సందడి సందడిగా..!

Bigg Boss Voting Request Game, Bigg Boss 8 Telugu Latest Episode Review
x

Bigg Boss 8 Day 93: బిగ్‌బాస్‌లో మొదలైన ఓటింగ్‌ రిక్వెస్ట్‌.. ఈ వారమంతా సందడి సందడిగా..!

Highlights

Bigg Boss 8 Telugu, Day 93: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో ఈసారి ఎవరు టైటిల్‌ విన్నర్‌ అవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Bigg Boss 8 Telugu, Day 93: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో ఈసారి ఎవరు టైటిల్‌ విన్నర్‌ అవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక టాప్‌5 జాబితాలోకి ఇప్పటికే చేరుకున్న అవినాష్‌ సేఫ్‌ జోన్‌లో ఉన్నారు. అయితే మిగిలిన గౌతమ్‌, రోహిణి, నిఖిల్‌, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్‌ నామినిషన్‌లో ఉన్నట్లే లెక్క. దీంతో వీరిలో టాప్‌4గా ఎవరు నిలుస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇందుకోసం బిగ్‌బాస్‌ కొన్ని గేమ్స్‌ కండక్ట్ చేస్తున్నాడు.

ఈ గేమ్స్‌లో విజేతలుగా నిలిచిన వారు ప్రేక్షకులను ఓట్ల కోసం రిక్వెస్ట్‌ చేసుకునే అవకాశం దక్కుతుంది. ఈ ప్రాసెస్‌ మంగళవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఓటింగ్‌ రిక్వెస్ట్ కోసం జంటలుగా కొన్ని ఛాలెంజెస్‌లో పాల్గొనాలి. ఎవరికైతే జంట ఉండదో వారు ఈ ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ జంటలని ఎంచుకొని చెప్పండని బిగ్‌బాస్ చెప్పాడు. అలా అవినాష్-నబీల్, ప్రేరణ-నిఖిల్, విష్ణు-రోహిణి జంటలుగా సెట్ అవగా.. గౌతమ్ ఏకాకిగా మిగిలిపోయాడు. ఇంతలో ట్విస్ట్ ఇచ్చిన నబీల్.. అవినాష్‌ని వదిలేసి గౌతమ్‌తో జోడీ కట్టాడు.

ఇలా మూడు జంటలకు 'నా టవర్ ఎత్తయినది' అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా జంటలు ఎవరికి వాళ్లు ఓ టవర్‌ నిర్మించాలి. అయితే ఈ టవర్‌ను వేరే జోడీలు పడగొట్టొచ్చు. బజర్ మోగేసరికి ఎవరిదైతే ఎత్తుగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఈ గేమ్‌లో ప్రేరణ-నిఖిల్ తొలి స్థానంలో నిలవగా, రోహిణి-విష్ణుప్రియ రెండో స్థానం దక్కించుకున్నారు. ఇక చివరి స్థానంలో నిలిచిన గౌతమ్-నబీల్.. ఓటు అప్పీల్ రేసు నుంచి తప్పుకున్నారు.

రెండో గేమ్‌లో భాగంగా 'టక్ టకాటక్' అనే గేమ్‌లో భాగంగా తమ తమ ప్లేసులో ఉండే డిస్కులు.. పక్క వాళ్ల ప్లేసులోకి తోసేయాలి. ఈ పోటీని ఒక్కొక్కరుగా ఆడాలి. ఈ గేమ్‌లో ప్రేరణ గెలిచి ఓట్‌ అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని దక్కించుకుంది. గేమ్‌లో గెలిచిన వెంటనే ప్రేరణను ఇన్ఫినిటీ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ప్రేక్షకుల్ని ఓట్ల కోసం రిక్వెస్ట్‌ చేసుకోమన్నాడు. ఈ సందర్భంగా ప్రేరణ కాస్త ఎమోషనల్‌ అయ్యింది. తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమ, సపోర్ట్ దొరికిందని చెప్పుకొచ్చింది. దీంతో బుధవారం ఓటింగ్ రిక్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఎవరికి దక్కనుందో ఆసక్తికరంగా మారింది. మరి ఈరోజు హౌజ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories