Bigg Boss Telugu 8: 'లక్కీ విష్ణు ప్రియ'.. నెగిటివిటీ మూటగట్టుకున్నా బయటపడింది..!

Bigg Boss Telugu 8 Vishnupriya Escaped From Elimination and Prithvi Eliminated From House
x

Bigg Boss Telugu 8: 'లక్కీ విష్ణు ప్రియ'.. నెగిటివిటీ మూటగట్టుకున్నా బయటపడింది..!

Highlights

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌లో మరో వారం గడిచిపోయింది. ఈ వారం హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమిటేన్‌ అవుతారా.? అన్న క్యూరియాసిటీకి చెక్‌ పెడుతూ నాగార్జున నిర్ణయం తీసుకున్నారు.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌లో మరో వారం గడిచిపోయింది. ఈ వారం హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమిటేన్‌ అవుతారా.? అన్న క్యూరియాసిటీకి చెక్‌ పెడుతూ నాగార్జున నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రథ్వీ ఎలిమినేట్‌ అయినట్లు నాగ్ ప్రకటించారు. హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా రాణించిన పృథ్వీ ఎట్టకేలకు హౌజ్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. శనివారం టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా ఆదివారం పృథ్వీ హౌజ్‌ నుంచి బయటకు వచ్చేశాడు.

ఇదిలా ఉంటే ఎలిమినేషన్‌ రౌండ్‌లో చివరిలో విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరు మిగిలారు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతోన్న చర్చ ప్రకారం విష్ణు ప్రియ హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కాబోతోందని చర్చ జరిగిన విషయం తెలిసిందే. శ్రీముఖి మాట్లాడిన తర్వాత విష్ణుప్రియకు బాగా నెగిటివిటీ ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో విష్ణు ప్రియ కచ్చితంగా ఈ వారం హౌజ్‌ నుంచి బయటకు రావడం ఖాయమని అంతా భావించారు. కానీ లక్కీ విష్ణు ప్రియ ఎలిమినేషన్‌ నుంచి ఎస్కేప్‌ అయ్యింది.

ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో కూడా బిగ్‌బాస్‌ కొత్త పంథాను ఎంచుకున్నాడు. పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్‌కి రమ్మని నాగార్జున పిలిచారు. అక్కడ ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు పెట్టారు. అలాగే రెండు లిక్విడ్ బాటిల్స్ కూడా ఇచ్చారు. నెం 1 అని రాసిన లిక్విడ్ ని ఇద్దరూ తమ ముందు ఉన్నఅక్వేరియంలో వేయాలని చెప్పారు నాగ్. దాంతో ఆ వాటర్ ఎల్లో కలర్ లోకి మారిపోయాయి.

ఇద్దరి అక్వేరియంలు ఎల్లో కలర్ లోకి మారిన తర్వాత మరో బాటిల్ అంటే నెం 2 అని రాసిన లిక్విడ్ ను అక్వేరియం వేయాలని ఎవరి అక్వేరియంలో వాటర్ రెడ్ కలర్‌లో మారితే వారు ఎలిమినేట్ అని చెప్పారు నాగ్. దాంతో ఇద్దరు ఆ లిక్విడ్ పోయగా.. పృథ్వీ వాటర్ రెడ్ కాగా విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా ఉండిపోయాయి. దాంతో పృథ్వీ ఎలిమినేట్ అంటూ ప్రకటించారు నాగార్జున.

దీంతో విష్ణు ప్రియా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. తనకు ఓటేసిన వాళ్లకి థాంక్యూ నన్ను నన్నుగా ప్రేమించారు.. థాంక్యూ అని విష్ణు చెప్పుకుంది. అందరికీ హగ్గు ఇచ్చి బైబై చెప్పాడు పృథ్వీ. ఇలా ఈ వారం గడిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories