Bigg Boss Telugu 8: 'ఎందుకు అంత దిగజారుతున్నావు'.. విష్ణు ప్రియకు క్లాస్ పీకిన శ్రీముఖి
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో టికెట్ టు ఫినాలె టాస్క్ రసవత్తరంగా సాగుతోంది.
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో టికెట్ టు ఫినాలె టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే మాజీ కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి వచ్చి కంటెండర్‌లను సెలక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు పలువురు మాజీ కంటెస్టెంట్స్ సందడి చేశారు. ప్రస్తుతం టాప్ 5 జాబితాలో మొదటి స్థానంలో రోహిణి ఉండగా.. తర్వాత రెండో కంటెండర్‌గా అవినాష్ నిలిచాడు. ఇక మూడో కంటెండర్‌గా ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకుంటున్న నిఖిల్ నిలిచాడు. మొత్తానికి ఈ టికెట్ టు ఫినాలే రేస్‌లో నిఖిల్, రోహిణి, అవినాష్‌ల మధ్య పోరు ఉండబోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో హౌజ్‌లోకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా విష్ణుప్రియతో ప్రత్యేకంగా మాట్లాడింది శ్రీముఖి. ముఖ్యంగా తనకు పృథ్వీకి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎక్కువగా ప్రస్తావించింది. ఒకరిని ఇష్టపడడం తప్పు కాదని, కానీ ఈ రెండు వారాలు తన కోసం ప్రథ్వీకి దూరంగా ఉండమని శ్రీముఖి సూచించింది. ప్రృథ్వీ తనకు ఇష్టం లేదని, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని శ్రీముఖి చెప్పుకొచ్చింది.
అంతటితో ఆగకుండా విష్ణుప్రియను ఒక గదిలోకి తీసుకెళ్లి మరీ ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పింది శ్రీముఖి. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోమని సూచించింది. ప్రృథ్వీతో ఈ ఫ్రెండ్ షిప్‌ని నువ్వు కంటిన్యూ చేయాలని అనుకుంటే ఈ రెండు వారాలు వదిలెయ్ అంటూ సలహా ఇచ్చింది. పృథ్వీ కూడా నువ్వు ఆడమని అంటేనే అడుతున్నాడా.? ఇవన్నీ ఎందుకు? చేస్తే అందర్నీ ఎంకరేజ్ చెయ్.. ఆ ఒక్క పర్సన్‌తో ఎందుకు?’ అని గట్టిగానే క్లాస్ పీకింది శ్రీముఖి. మరి శ్రీముఖి చెప్పిన విషయాలను విష్ణుప్రియ నిజంగానే ఫాలో అవుతుందా.? ఈ రెండు వారాలు పృథ్వీతో ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire