Bigg Boss Telugu 8 Launch: నేడు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్.. అతిథులుగా నాని, రానా

Bigg Boss Telugu 8 season launch today Nani and Rana will be the guests
x

Bigg Boss Telugu 8 Launch: నేడు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్.. అతిథులుగా నాని, రానా

Highlights

Bigg Boss Telugu 8 Launch: నేడు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ గ్రాండ్ గా జరగనుంది. షో ఓపెనింగ్ రోజు స్టార్ సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి సందడి చేయనున్నారు. ఈ బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ కు గెస్టులుగా నాని, దగ్గుబాటి రానాతోపాటు మరో ఇద్దరు గెస్టులుగా రానున్నారు.

Bigg Boss Telugu 8 Launch: బిగ్ బాస్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నేడు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన షూటింగ్, డ్యాన్స్ ఫర్ఫామెన్సెస్ గెస్టుల ఎంటీ, హోస్ట్ నాగార్జునతో వారి మాట ముచ్చట్లు వారుచేసే సందడి అంతా శనివారం ముగిసింది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో మొత్తంగా సుమారు 20 మంది కంటెస్టెంట్స్ వరకు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. వారిలో 14 మంది లాంచింగ్ మొదటిరోజు ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.

ఆదివారం రోజు 14మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 తెలుగు ఎంట్రీని స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత నుంచి 24గంటలు లైవ్ స్ట్రీమింగ్ ను ఓటీటీలో మాత్రం టెలీకాస్ట్ చేస్తారు. అయితే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అంటే స్టార్ సెలబ్రిటీలు అతిథులుగా రావడం తెలిసిందే.

అయితే ఈ సీజన్ కోసం కొంతమంది సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు. సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని బిగ్ బాస్ తెలుగు 8కు గెస్టుగా వచ్చి స్టేజీపై నాగార్జునతో సందడి చేశారు. బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ కు నాని హోస్టుగా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ స్టేజీపై ఇద్దరు హోస్టులు ఉండటం విశేషం.

గతంలో కూడా నాని చాలా సార్లు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నానితోపాటు దగ్గుబాటి రానా,నివేదా థామస్ కూడా అతిథులుగా హాజరయ్యారు. నివేదా థామస్ ప్రధాన పాత్రలో రానా నిర్మించిన 35 చిన్న కథ కాదు మూవీని ప్రమోట్ చేసేందుకు గెస్టులుగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది.

వీరితోపటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా గెస్టుగా బిగ్ బాస్ స్టేజీపైకి హాజరయ్యారని సమాచారం.కామెడీ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి గతంలో కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories