Bigg Boss 8 Telugu: హౌజ్‌లో చిచ్చు రేపిన 'ఎగ్‌ టాస్క్‌'.. మరోసారి బోరుమన్న మణికంఠ

Bigg Boss 8 Telugu
x

 Bigg Boss Telugu 8: హౌజ్‌లో చిచ్చు రేపిన 'ఎగ్‌ టాస్క్‌'.. మరోసారి బోరుమన్న మణికంఠ

Highlights

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌8 క్రమంగా రసవత్తరంగా మారుతోంది. గొడవలు, ప్రేమలు, స్నేహలు, ఏడుపులు ఇలా షో రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌8 క్రమంగా రసవత్తరంగా మారుతోంది. గొడవలు, ప్రేమలు, స్నేహలు, ఏడుపులు ఇలా షో రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ముఖ్యంగా టాస్క్‌ల విషయంలో కంటెస్టెంట్స్‌ ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. కచ్చితంగా టైటిల్‌ కొట్టాలనే కసి ప్రతీ ఒక్కరిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే టాస్క్‌ల సమయంలో తీవ్ర గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా 17వ రోజుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వీడియో ప్రకారం ఈరోజు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎగ్‌ కలెక్టింగ్ టాస్క్‌ ఉండనున్నట్లు తెలుస్తోది. కోడి గుడ్లను సేకరించే క్రమంలో కంటెస్టెంట్స్‌ మధ్య ఓ రేంజ్‌లో ఫైట్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో టాస్క్‌ నుంచి ఒక వ్యక్తి ఎలిమినేట్ కావాల్సి రావడంతో నాగ మణికంఠను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురైన మణికంఠ మూలకు వెళ్లి గోడకు తల ఆనించి బోరుమని ఏడ్చాడు. ఇది గమనించిన అభయ్ నవీన్ మణికంఠను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అయితే నాగ మణికంఠ మాత్రం ఏడుపు ఆపలేదు.. ‘ నా పెళ్లాం బిడ్డలు దక్కాలంటే నేను ఈ షో విన్ అవ్వాలి. బిగ్ బాస్ టైటిల్ గెలవాలి’ అని మరింత ఎమోషనల్ అయ్యాడు.

అయితే అభయ్‌ ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేసినా నాగ మణికంఠ మాత్రం ఏడుపును ఆపలేదు. ‘ నాకు ఎవరూ లేరు, వాళ్లు నా లైఫ్‌లోకి రావాలంటే షో గెలవాలి’ అని భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఇంతకీ నాగ మణికంఠను ఎందుకు టాస్క్‌ నుంచి ఎలిమినేట్ చేశారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ను చూడాల్సిందే. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరిగిందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories