Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్‌ ట్విస్ట్‌.. హౌజ్‌ నుంచి ఇద్దరు బయటకు.?

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్‌ ట్విస్ట్‌.. హౌజ్‌ నుంచి ఇద్దరు బయటకు.?
x
Highlights

బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 9 వారాలు విజయవంతంగా పూర్తయ్యింది. ఇక 10వ వారం ఎలిమినేషన్‌కు కూడా రంగం సిద్ధమైంది. దీంతో ఈ...

బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 9 వారాలు విజయవంతంగా పూర్తయ్యింది. ఇక 10వ వారం ఎలిమినేషన్‌కు కూడా రంగం సిద్ధమైంది. దీంతో ఈ వారం హౌజ్‌లో నుంచి ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వారం ఎలిమినేషన్‌ జాబితాలో నిఖిల్‌, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్‌ కృష్ణ, పృథ్వీ, హరితేజ ఉన్నారు.

వీరిలో నిఖిల్‌, విష్ణు, గౌతమ్‌లకు ఓట్లు భారీగా పడ్డాయని తెలుస్తోంది. దీంతో వీళ్లలో ఎవరూ ఎలిమినేట్‌ అయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలింది పృథ్వీ, యష్మి, హరితేజలే. వీరిలో హౌజ్‌ నుంచి వెళ్లి పోయేది ఎవరనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. అయితే అనారోగ్య కారణాల వల్ల గంగవ్వ హౌజ్‌ నుంచి వెళ్లిపోనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

గత సీజన్‌లో కూడా స్వయంగా ఎలిమినేట్‌ అయిన గంగవ్వ ఈవారం కూడా అనారోగ్య కారణాలతో వెళ్లిపోవడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ ఉండదని కొందరు భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం గంగవ్వతో పాటు మరొకరు కూడా ఈసారి హౌజ్‌ నుంచి బయటకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

ఎలిమినేట్‌ అయ్యేది మరెవరో కాదని హరితేజ అని తెలుస్తోంది. ఓట్ల విషయంలో హరితేజ వెనుకంజలో ఉన్న నేపథ్యంలో ఆమెను హౌజ్‌ నుంచి పంపించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది.? ఈ వారం హౌజ్‌ నుంచి బయటకు వెళ్లేది ఎవరో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories