సైకిల్ తొక్కండి..వాటర్,గ్యాస్ పొందండి! బిగ్‌బాస్‌ టాస్క్

సైకిల్ తొక్కండి..వాటర్,గ్యాస్ పొందండి! బిగ్‌బాస్‌ టాస్క్
x
Highlights

లగ్జరీ బడ్జెట్ టాస్క్.. తమన్నా అలక.. శివజ్యోతి తాలింపు..రితిక ఏడుపు.. శ్రీముఖి సైలెన్స్.. ఇవీ బిగ్‌బాస్‌ ఎపిసోడ్ 10 విశేషాలు. లగ్జరీ బడ్జెట్ టాస్క్...

లగ్జరీ బడ్జెట్ టాస్క్.. తమన్నా అలక.. శివజ్యోతి తాలింపు..రితిక ఏడుపు.. శ్రీముఖి సైలెన్స్.. ఇవీ బిగ్‌బాస్‌ ఎపిసోడ్ 10 విశేషాలు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్‌బాస్‌ వనరులను జాగ్రత్తగా వాడుకోవాలనే సందేశాన్ని ఇస్తూనే.. గ్యాస్, నీరు కావాలంటే ఇంటి సభ్యులు కష్టపడాలని సూచించాడు. అందుకోసం మూడు సైకిళ్లు ఏర్పాటు చేశాడు. హౌస్ ఏక్సిస్ తో సహా ఏది కావాలన్నాసభ్యులు సైకిల్ తొక్కాల్సిందే. దాంతో అందరూ సైకిల్ తొక్కే పనిలో పడ్డారు. అయితే, ఈ టాస్క్ హౌస్ మేట్స్ మధ్యలో పెద్ద రగడ సృష్టించింది. వంట చేయాలంటే గ్యాస్ కావాలి. గ్యాస్ కావాలంటే సైకిల్ తొక్కాలి. దాంతో పునర్నవి సైకిల్ తొక్కుతుంటే.. వితిక దోశలు వేస్తూ వచ్చింది. టిఫిన్ కార్యక్రమం ముగిసాకా.. వితిక లివింగ్ రూమ్ లో రిలాక్స్ అవుతూంది. ఈ సమయంలో అక్కడకి వచ్చిన పునర్నవి టాస్క్ లో పార్టిసిపేట్ చేయొచ్చుగా అంటూ సలహా ఇచ్చింది. దాంతో ఇద్దరి మధ్య మాటలు ముదిరాయి. నాకు సలహా ఇవ్వడమెందుకు నాకు తెలుసు ఎప్పుడు సైకిల్ తోక్కాలో అని వితిక పునర్నవి పై ఫైర్ అయింది. వరుణ్ సర్ది చెప్పాలని ప్రయత్నించి సగటు భర్తలా విఫలమయ్యాడు. వితిక పునర్నవికి..నాకు మధ్యలో నువ్వు రాకు అని స్పష్టంగా చెప్పింది. ఈ వ్యవహారం చాలాసేపు నడిచింది. హౌస్ మేట్స్ వితిక కు నచ్చచెప్పే క్రమంలో అందరూ తననే అంటున్నారంటూ భోరుమని ఏడ్చి కొంతసేపు గందరగోళం సృష్టించింది. ఇక శివజ్యోతి సైకిల్ టాస్క్ విషయంలో మూడు టీములుగా మారాలని కోరింది. అందరూ ఆ మాటని కొట్టిపారేయడంతో అందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం రావాలి కదా అంటూ రచ్చ చేసింది. అప్పటికే గంట నుంచి సైకిల్ తొక్కుతున్న శ్రీముఖిని అడిగి ఆ సైకిల్ తీసుకో అని హౌస్ మేట్స్ సూచించారు. దీంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అయితే, అప్పటికే శ్రీముఖి ని తమన్నా సైకిల్ తోక్కుతనని అడిగింది. ఈ లోపు శివజ్యోతి గొడవతో సైకిల్ ఆమెకి ఇచ్చింది శ్రీముఖి. దీంతో తమన్నా అంటే.. గొడవ చేసిన వారికే హౌస్ లో విలువిస్తారన్న మాట అంటూ శ్రీముఖికి సెటైర్ వేసింది.

టిఫిన్ సమయంలో తనను రవికృష్ణ ఎదో అన్నాడంటూ కొంత సేపు తమన్నా అలిగింది. హౌస్ లో ఎవరూ ఎవరినీ ఏమీ అనరని అది సరదా కోసం అన్నాడనీ, దానిని సీరియస్గా తీసుకోవద్దనీ రోహిణి, శివజ్యోతిలు ఓదార్చడం తో అలక వీడింది.

ఇక బాబా భాస్కర్, జాఫర్, తమన్నా, మహేష్ లు శ్రీముఖి గురించి మాట్లాడుకున్నారు. శ్రీముఖికి గేమ్ లో సరైన స్ట్రాటజీ లేదంటూ జాఫర్ అన్నాడు. తను చెప్పిన సలహాలు శ్రీముఖి వినడం లేదనీ, మొదటి వారం యాక్టివ్ గా ఉన్న శ్రీముఖి ఈ వారం సైలెంట్ అయిపోయిందనీ మహేష్ చెప్పుకొచ్చాడు.

ఇక అందరూ నిద్ర పోయిన సమయంలో హౌస్ యాక్ససరీస్ సైకిల్ తొక్కుతున్న శివజ్యోతి ఆలస్యం చేయడంతో అలారం మోగింది. ఈ వ్యవహారం కొంత గొడవకు దారితీసింది. ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బుధవారం ఈ గొడవ ఎలా మారుతుందో చూడాలి.

ఎలా వుందంటే..

ఈ ఎపిసోడ్ హౌస్ లో ఉన్నవారు అసలు టాస్క్ ల పై అవగాహన లేకుండా ఎలా పడితే అలా చేస్తున్న విషయాన్ని బట్టబయలు చేసింది. సైకిల్ టాస్క్ ఇవ్వగానే.. బజర్ మోగగానే శ్రీముఖి సైకిల్ ఎక్కేసింది. ఎవరు ఏ పని చేయాలని నిర్ణయించుకోలేదు. ఎవరూ టీం గా ఆట ఆడటం లేదు. ఎవరికీ నచ్చినట్టు వారు చేసుకుంటూ పోతున్నారు. వితిక ఈ ఎపిసోడ్ లో కొంత ఎక్కువగా రియాక్ట్ అయింది. నిజానికి పునర్నవి తప్పు ఏమీ లేకపోయినా.. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి ఏడుపు రాగాని అందుకుంది. వరుణ్ వితిక్.. పునర్నవి మధ్యలో ఇరుక్కుపోయాడు. తమన్నా జాగ్రత్తగా ఆడుతోంది. శ్రీముఖి కొంత సైలెంట్ గా ఉంది.

మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా సైకిల్ టాస్క్ తో ఉత్కంత గా సాగింది.

మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories