Bigg Boss 8 Telugu: ఈ వారం హౌజ్ నుంచి వెళ్లేది ఎవరు.? డబుల్ ఎలిమినేషన్ ఉందా..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంటున్నకొద్దీ ఇంట్రెస్టింగ్ పెరుగుతోంది. రోజురోజుకీ షో ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా శనివారం ఎపిసోడ్లో...
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంటున్నకొద్దీ ఇంట్రెస్టింగ్ పెరుగుతోంది. రోజురోజుకీ షో ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఓ రేంజ్లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. మెగా చీఫ్‌గా గెలిచిన రోహిణిని పొగిడిన నాగార్జున ఆ తర్వాత రోహిణిని, విష్ణుప్రియతో ప్రత్యేకంగా మాట్లాడారు. టాస్క్‌లో భాగంగా వీరిద్దరూ ఒకరికపై ఒకరు దూషించుకున్న విధానాన్ని నాగ్ తప్పు పట్టారు.
ప్లాన్ అంటూ రోహిణి చేసిన వ్యాఖ్యలను, క్యారెక్టర్ అంటూ విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ నాగార్జున తప్పుబట్టారు. అయితే మొత్తం మీద రోహిణి మాత్రం టాప్5లోకి దూసుకెళ్లిపోయిందని చెప్పాలి. ఇక ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని ఒక లేడీ కంటెస్టెంట్ వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వారం నామినేషన్స్‌లో నబీల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మీ.. ఉన్నారు వీరిలో ఒకరు మరికొన్ని గంటల్లో హౌజ్ నుంచి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ వినూత్నంగా నిర్వహించిన విషయం తెలిసిందే. హౌజ్ నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్‌ను తిరిగి రప్పించి నామినేట్ చేయించారు. ఇదిలా ఉంటే నామినేట్ అయిన వారిలో యష్మీ ఇంటి నుంచి బయటకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తొలినుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా రాణిస్తున్న యష్మీ.. 12 వారాలుగా హౌజ్‌లో ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఓటింగ్ తగ్గడం, రకరకాల కారణాలతో ఆమె హౌజ్ నుంచి బయటకు రాకుండా తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్లో నాగ్ హౌజ్‌మేట్స్‌తో ఆడించిన స్నేక్ గేమ్ కూడా ఆసక్తిగా మారింది. నిఖిల్, గౌతమ్‌లకు మూడేసి స్నేక్‌లు రావడంతో వారిలో ఒకరిపై బిగ్ బాండ్ పడబోతోందని నాగ్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire