Bigg Boss 5: సెప్టెంబర్ 5న బిగ్ బాస్-5 మొదలు.!? ఆగష్టు 22న క్వారెంటిన్

Bigg Boss 5 Season Starts From 5th September And Contestants Quarantine From 22nd August  2021
x

బిగ్ బాస్ 5 (ట్విట్టర్ ఫోటో)

Highlights

Bigg Boss 5: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ అభిమానుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది. సెప్టెంబర్ 5న ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో ప్రారంభం...

Bigg Boss 5: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ అభిమానుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది. సెప్టెంబర్ 5న ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రోమోని ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు సమాచారం. సీజన్ 5 లో కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా కంటెస్టంట్ లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో అబ్బాయిల కంటే లేడి కంటెస్టంట్ లు ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఫైనల్ అయిన కంటెస్టంట్ లను ఆగష్టు 22 నుండి క్వారెంటిన్ లో ఉంచబోతున్నారు. 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ 5 హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే హౌస్ మేట్స్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు కూడా పూర్తి చేసుకున్నాకే బిగ్ హౌస్ లోకి పంపనున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం యాంకర్ రవి, లోబో, సినిమా హీరోయిన్ ఇషా చావ్లా, నవ్య స్వామి,యూట్యూబ్ నిఖిల్, డాన్సర్ ఆనీ మాస్టర్, జబర్దస్త్ వర్షిని, సీరియల్ ఆర్టిస్ట్ విజే సన్నీలు దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. మరోపక్క యూట్యూబ్ ఫేమ్ షన్ముఖ్ జశ్వంత్ రాబోతున్నడనే వార్తలు వినిపిస్తున్న అతని ఎంట్రీపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. గత సీజన్ తో పోలిస్తే ఈ బిగ్ బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్షకులను మరింత అలరిస్తుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories