Bigg Boss 4 Updates: 'బిగ్ బాస్-4' ప్రారంభం.. సెప్టెంబర్ 6 నుంచే..
Bigg Boss 4 Updates: కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో బిగ్ బాస్ షో కోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు.
Bigg Boss 4 Updates: రియాల్టీ షో లలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే షో కు సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యాయి. బిగ్ బాస్ కు సంబంధించి రోజుకోరకమైన వార్తలు వైరల్ కావడమూ ప్రారంభం అయింది.
Bigg Boss 4 Updates: కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో బిగ్ బాస్ షో కోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. ఇప్పటికే దాదాపుగా షో లో పాల్గొనే అవకాశం ఉన్న 20 మందిని క్వారంటైన్ లో ఉంచారని చెబుతున్నారు. 14 రోజుల పాటు వీరి క్వారంటైన్ పూర్తి అయిన తరువాత మళ్ళీ వారికి కోవిడ్ పరీక్షలు జరిపి కచ్చితంగా నెగెటివ్ ఉన్నవారినే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలనేది నిర్వాహకుల ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఎంపిక చేసిన కంటెస్టంట్ లు అందరినీ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంచి క్వారంటైన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నెల 30 వతేదీన బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందనే వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే, నాలుగో సీజన్ సెప్టెంబరు 6న ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున మరోసారి ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న. ఈ కార్యక్రమం ప్రీమియర్స్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితం స్టార్ మా ట్విట్టర్ ద్వారా ప్రోమోను రీలీజ్ చేసింది. సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్-4 సందడి షురూ అవుతుంది. అని మీరు ఎప్పుడు చూడని ఎంటర్టైన్మెంట్, భావోద్వేగాలు అంటూ బిగ్గ్ బాస్ సీజన్ 4 హోస్ట్ నాగార్జున తాజా ప్రోమోలో పేర్కొన్నారు.
Keep your TV Remote Ready for Entertainment Like Never Before!!! #WhatAWowWow 👁️#BiggBossTelugu4 Premieres September 6th at 6 PM on @StarMaa pic.twitter.com/5bbL4TsEjT
— starmaa (@StarMaa) August 27, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire