Bigg Boss 4 Telugu: కల్యాణి రాగాలు.. నామినేషన్ కనెక్షన్లు.. మొదటి రోజు అంతా ఎమోషనల్ యాంగిల్!

Bigg Boss 4 Telugu: కల్యాణి రాగాలు.. నామినేషన్ కనెక్షన్లు.. మొదటి రోజు అంతా ఎమోషనల్ యాంగిల్!
x

Bigg Boss 4 Telugu Day 1 (Image courtesy star maa twitter)

Highlights

Bigg Boss 4 : కల్యాణి..సుజాతల వంట గోల.. గంగవ్వ చెణుకులు.. తొలిరోజు మొత్తం దుఃఖ గీతాలు!

మొదటిరోజే..బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఎమోషన్స్ పెంచేశారు. బహుశా తమ ఎమోషనల్ స్టోరీ లతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అనుకున్నారేమో. నాగార్జున కనెక్టింగ్ గేమ్ అని చెబితే హౌస్ లో వీళ్ళు ఎమోషనల్ కనెక్టింగ్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపించింది. ప్రతి సీజన్ లోనూ ఒకరు నీటి బిందెలు పెట్టుకుని బిగ్ బాస్ లోకి వస్తారేమో. ఈసారి మోనాల్ ఆ స్థానం తీసుకుంది. నిన్న హౌస్ లోకి వెళుతూనే మొదలుపెట్టిన రాగాలు మొదటి రోజు కొనసాగించింది. ఆమె ఎమోషన్ చూసి పాపం గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.

అనుకున్నట్టుగానే గంగవ్వ బిగ్ బాస్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. హౌస్ లో అందరూ ఆమెకు సహాయంగా ఉంటూ ఎటాచ్మెంట్ పెంచుకుంటున్నారు. ఉదయాన్నే మ్యూజిక్ కి డాన్స్ చేసేటప్పుడు గంగవ్వకు అంతా మూమెంట్స్ నేర్పించారు. తరువాత కూడా ఆమెతో అంతా ఎక్కువ సేపు కలిసి ఉండడం కనిపించింది.

మోనాల్ తన వేరియేషన్స్ చూపించింది. బిగ్ బాస్ ఉదయాన్నే పోస్ట్ పంపించాడు. దానిని చదవడానికి రావాలని లాస్య మోనాల్ ని పిలిస్తే.. నేను స్నానం చేయాలి రాను.. 5 నిమిషాలు వెయిట్ చేయండి అంది. లాస్య అందరూ నీ ఒక్కదానికోసం వేచి ఉండాలి కదా అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. తరువాత బిగ్ బాస్ అందరికీ ఇచ్చిన చిన్న టాస్క్ లో ఆమెకు తన ఊరి గురించి చెప్పమంటే.. మా నాన్న అంటూ తన కుటుంబం గురించి చెప్పడం..అదీ చక్కని ఇంగ్లీషులో మొదలు పెట్టి రాగాలు తీసింది. ఇక ఇదే సందర్భంగా ఒక్కరోజు మాత్రమె మిగిలివుంది చనిపోవడానికి అంటే నువ్వు ఎవరితో గడపాలని అనుకుంటావు అనే ప్రశ్నకు అమ్మా..నాన్నతో అని చెబుతూ ఎమోషన్ అయిపోయాడు మహబూబ్.

కల్యాణి వంట..సుజాతకు తెచ్చింది తంటా!

సుజాత తో కల్యాణి గొడవ స్టార్ట్ చేసింది. ముందు ఉదయాన్నే ఎక్కడో సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా, సోహెల్ ఇద్దరూ హౌస్ లోకి ఫోన్ చేసి ఫుడ్ పంపించమని చెప్పారు. ఆ ఫోన్ సుజాత లిఫ్ట్ చేసింది. అవతల బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారనుకుని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారంటూ హౌస్ మేట్స్ అందరికీ చెప్పింది. దీనికి కల్యాణి బిగ్ బాస్ అని నువ్వు ఎలా అనుకున్నావు అంటూ వేసుకుంది. ఇక అక్కడ నుంచి కల్యాణి..సుజాతల మధ్య రగడ మొదలైంది. నామినేషన్ సందర్భంగా ఇది మరింత పెద్దదైంది. సుజాతను నామినేట్ చేయాలని అనుకున్నప్పుడు కల్యాణి ముందు జరిగిన గొడవను బయటకు తీసి రకరకాలుగా మాట్లాడింది.దానికి సుజాత సమాధానం చెప్పబోతే కూడా అడ్డుకుంది. అటు తరువాత రాత్రి వంట విషయంలో సుజాత నేను వంట చేస్తాను..చికెన్ వండుతా అని అంది. అంతే..ఇక కల్యాణి షురూ చేసింది. రాగాలు తీసింది. హౌస్ మొత్తం నానా యాగీ చేసింది. నేను వంట చేస్తుంటే సుజాత అలా ఎందుకు అంది అంటూ గట్టి గట్టిగా మాట్లాడింది. లాస్య ఆమెకు సర్ది చెప్పబోతే వెక్కి వెక్కి ఏడ్చి అందర్నీ కంగారు పెట్టింది. ముందే చెప్పినట్టు హౌస్ లో అందరూ ఎమోషన్ కి కనెక్ట్ అయిపోయారు. ప్రేక్షకులు కూడా అలానే కనెక్ట్ అయిపోతారనె లెక్కలో ఉన్నట్టున్నారు..

నామినేషన్ లో వీరే!

మొదటి రోజే నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. హౌస్ లోకి పంపిస్తున్నపుడు కనెక్షన్ లింక్ పెట్టిన బిగ్ బాస్.. దానిని నామినేషన్ కి లింక్ పెట్టాడు. ఒక్కో కనెక్టింగ్ జంట గార్డె ఏరియాలోని రెండు కిటికీల వద్ద నిలబడాలి. మిగిలిన హౌస్ మేట్స్ వారిలో ఒకరిని నామినేట్ చేయాలి. ఇదీ ఆ లింక్. ఇక ముందు అభిజిత్..హారిక నామినేషన్ కోసం నిలబడ్డారు. అందరూ అభిజిత్ ను నామినేట్ చేయడానికి ఒకే చెప్పారు. తరువాత సూర్యకిరణ్..దేవి నాగవల్లి వెళ్ళారు. వారిలో సూర్యకిరణ్ ను నామినేట్ చేశారు. మూడో జంటగా అఖిల్, కల్యాణి వెళ్లారు. దానిలో అఖిల్ ను నామినేట్ చేశారు. ఇక తరువాత దివి, అమ్మరాజశేఖర్ నిలబడ్డారు. దానిలో దివిని నామినేట్ చేశారు. ఐదో జంటగా లాస్య..మహబూబ్ వెళ్ళారు. మహబూబ్ ను నామినేట్ చేశారు అందరూ. తరువాత వంతు సుజాత, మోనాల్ వీరిలో సుజాత ను నామినేట్ చేశారు. ఇక చివరికా మంగవ్వ..నోయల్ వెళ్లారు. ఇక్కడ అందరూ ఒక్క హారిక తప్ప మిగిలిన అందరూ గంగవ్వను నామినేట్ చేశారు. దీంతో మొదటి వారం నామినేషన్స్ లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్, దివి, మహబూబ్, సుజాత, గంగవ్వ నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories