Bigg Boss 4 Telugu: కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ లో ఆమీ తూమీ!

Bigg Boss 4 Telugu: కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ లో ఆమీ తూమీ!
x

Bigg Boss 4 Telugu Highlights (courtesy..Hotstar)

Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 38 లో కెప్టెన్సీ టాస్క్ కోసం శ్రమిస్తున్న హౌ మేట్స్

బిగ్ బాస్ ఆరోవారంలో అడుగు పెట్టింది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. అంతకు ముందు ఇంటి సభ్యులు అంతా మార్నింగ్ మస్తీలో భాగంగా బిగ్ బాస్ ఇంటి వస్తువులుగా మారిపోయి కామెడీ పంచారు. ఇక అందరి మధ్యలో గ్రూపు డిస్కషన్ లు మామూలుగానే సాగాయి. అభిజిత్..హారిక ల మధ్య మోనాల్ గురించి సంభాషణ సాగింది. ఇక టాస్క్ ఆమీ తూమీ అంటూ ఇచ్చారు.

రెండు టీములుగా ఆమీ తూమీ కి సిద్ధపడ్డారు. అరియానా రెడ్ టీం.. అఖిల్ బ్లూ టీం.. సోహైల్ సంచాలకుడు. రెడ్ టీం లో అభిజీత్, మెహబూబ్, లాస్య, అవినాష్, మోనాల్. బ్లూ టీం లో హారిక, నోయల్, దివి, కుమార్, అమ్మ రాజశేఖర్ ఉన్నారు. ఇందులో భాగంగా రెండు టీం లకు సమానంగా బిగ్ బాస్ బంగారు నాణేలు ఇచ్చాడు. బిగ్ బాస్ డీల్ చెబుతాడు. రెండు టీం లలో ఏ టీం ఆ డీల్ కు ఒప్పుకుంటుందో బెల్ ద్వారా చెప్పాలి. బెల్ మోగించిన టీం నుంచి ఒకరు వెళ్లి ఆ డీల్ పూర్తి చేసి రావాలి. డీల్ పూర్తయిన తరువాత ఆ డీల్ కు నిర్ణయించిన కాయిన్స్ సోహైల్ కు ఇవ్వాలి. ఇలా డీల్స్ పూర్తయ్యేసరికి ఏ టీం దగ్గర తక్కువ కాయిన్స్ ఉంటే ఆ టీం గెలిచినట్టు.

మొదటి డీల్.. ఒక మగ సభ్యుడు తన ఒంటి మీద ఉన్న దుస్తుల్ని పూర్తిగా కట్టిరించేసుకోవాలి. ఈ డీల్ అఖిల్ బెల్ కొట్టాడు. దీంతో కుమార్ సాయి తన ఒంటిమీది దుస్తులను అన్నిటినీ కత్తిరించేసుకున్నాడు.

రెండో డీల్.. ఎవరైనా ఒక సభ్యుడు తన ఒంటి మీద దుస్తులు తప్ప తనకు సంబంధించిన అన్ని వస్తువులూ హౌస్ నుంచి బయటకు పంపించేయాలి. ముందుగా అరియానా బెల్ కొట్టింది. దీంతో అరియానా టీం లోని అభిజిత్ తన వస్తువులు అన్నీ ఇచ్చేశాడు.

మూడో డీల్.. ఎవరైనా ఒక టీం సభ్యురాలు తన జుట్టు సగం వరకూ కత్తిరించుకుని తలకు ఎర్ర రంగు వేసుకోవాలి. ఈ డీల్ కి అఖిల్ బెల్ మోగించాడు. దీంతో అఖిల్ టీం లోని హారిక తన జుట్టు కత్తిరించుకుంది.

నాలుగో డీల్.. ఎవరైనా ఒక టీం సభ్యుడు పుల్లీకి కట్టి ఉన్న ఇసుక మూటను మార్క్ కిందికి వెళ్ళకుండా ఒక చేత్తో కదల కుండా పట్టుకోవాలి. ఇలా బిగ్ బాస్ మళ్ళీ చెప్పేవరకూ పట్టుకుని ఉండాలి. ఇసుక మూట మార్క్ కిందికి దిగకుండా చూసుకోవాలి. అతి కష్టమైనా..దీనిని కుమార్ సాయి పూర్తి చేశాడు.

ఐదో డీల్.. నాలుగురకాలు కలిపిన డ్రింక్ ఎవరైనా ఒక టీం సభ్యుడు తాగాలి. ఈ డీల్ కు అరియానా బెల్ కొట్టింది. దీంతో ఆ టీం లోని లాస్య రెండు గ్లాసులు తాగి డీల్ పూర్తి చేసింది.

ఆరో డీల్.. ఒక టీం సభ్యుడు బిగ్ బాస్ ఇచ్చే జూట్ డ్రెస్ ను ధరించాలి. ఈ డీల్ కు అరియాన బెల్ కొట్టింది. దీంతో ఆ టీం లోని మోనాల్ జ్యూట్ డ్రస్ ధరించింది. బిగ్ బాస్ చెప్పేవరకూ ఆ డ్రస్ తో సందడి చేసింది.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో రెండు టీం లు సమానమైన పాయింట్లతొ నిలిచాయి. తదుపరి ఎపిసోడ్ లో ఏ టీం గెలుస్తుందో చూడాలి.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్లిపోతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి!

ఇది అధికారిక పోల్ కాదు. కేవలం మీ అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే. మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories